విధుల్లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ : ఈసీ రజత్ కుమార్
ప్రిసైడింగ్ అధికారులుగా, సహాయ ప్రిసైడింగ్ అధికారులుగా, ఇతర పోలింగ్ అధికారులుగా, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షలమందికి ఎన్నికల బాధ్యతలు అప్పచెబుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

ప్రిసైడింగ్ అధికారులుగా, సహాయ ప్రిసైడింగ్ అధికారులుగా, ఇతర పోలింగ్ అధికారులుగా, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షలమందికి ఎన్నికల బాధ్యతలు అప్పచెబుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
హైదరాబాద్ : ఏప్రిల్ 11న తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పలు రకాల విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 2.8 లక్షలమoది ఎన్నికల సిబ్బంది వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. రజత్ కుమార్ తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులుగా, సహాయ ప్రిసైడింగ్ అధికారులుగా, ఇతర పోలింగ్ అధికారులుగా, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షలమందికి ఎన్నికల బాధ్యతలు అప్పచెబుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వీరితో పాటు వెబ్ కాస్టర్లుగా, వీడియోగ్రాఫర్లుగా, డ్రైవర్లుగా, క్లీనర్లుగా మరో లక్షమందికి పైగా ఎన్నికల విధుల్లో ఉన్నారని ఆయన తెలిపారు.
Read Also : పార్టనర్ యాక్టర్ నామినేషన్ వేస్తే వచ్చేది టీడీపీ కార్యకర్తలే
గత శాసనసభ ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలట్‌లు ఇవ్వడం జరిగిందని రజత్ కుమార్ తెలిపారు. అయితే ఈసారి ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారిలో చాలామంది వారికి జారీ చేసిన ఎన్నికల డ్యూటీ సర్టిఫికేట్(ఇడిసి)లతో ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలోనే ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నవారికి ఈ సర్టిఫికేట్ జారీ చేస్తున్నారు. వీరు ఆసర్టిఫికేట్ ఆధారంగా ఆ నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రంలోనయినా ఓటువేసే అవకాశం కల్పించారు. ఈ ఇడిసిలు, పోస్టల్ బ్యాలట్‌లు జారీ చేసే ప్రక్రియ మరింత పారదర్శంగా జరగడానికి ‘పిబిసాఫ్ట్’ అనే సాఫ్ట్ వేర్ రూపకల్పనకు కృషి చేసినట్లు డా.రజత్ కుమార్ వివరించారు.
రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న వారందరూ వారికి సంబంధించిన 12/12 ఎ ఫారమ్‌ను తప్పులు లేకుండా నింపి వారి ఎన్నికల విధి నిర్వహణ వివరాలు జతపరుస్తూ మరో వారం రోజులలోగా వారి సంబంధిత జిల్లా కలెక్టర్‌ని కలవాలని ఆయన సూచించారు. ఈ సర్టిఫికేట్ల/పత్రాల ఆధారంగా అందరూ శిక్షణా కార్యక్రమాలకు హజరు కావచ్చని కూడా సిఈవో రజత్ కుమార్ తెలిపారు.
Read Also : జగన్ సభలో కూలిన ఇంటి స్లాబ్ : 30 మందికి గాయాలు