ఆ ప్లాన్ వర్కవుట్ అయితే.. చంద్రబాబు ఏపీలో అమలు చేస్తారా..?
నిజానికి అక్కడ ఏం లేదంట.. కానీ ఏ మూలనో ఏదో ఉందన్న ఆశ మాత్రం ఆయనను లోలోపల వేధించేస్తుందంట. అందుకే ఏదో ఒకటి చేయాలనుకుని ఫిక్సయిపోయారు. తెలంగాణ

నిజానికి అక్కడ ఏం లేదంట.. కానీ ఏ మూలనో ఏదో ఉందన్న ఆశ మాత్రం ఆయనను లోలోపల వేధించేస్తుందంట. అందుకే ఏదో ఒకటి చేయాలనుకుని ఫిక్సయిపోయారు. తెలంగాణ
నిజానికి అక్కడ ఏం లేదంట.. కానీ ఏ మూలనో ఏదో ఉందన్న ఆశ మాత్రం ఆయనను లోలోపల వేధించేస్తుందంట. అందుకే ఏదో ఒకటి చేయాలనుకుని ఫిక్సయిపోయారు. తెలంగాణ పార్టీ కోసం రెండు రోజులు కేటాయించారు. మరి ఈ రెండు రోజులు పార్టీ బలోపేతానికే పని చేస్తున్నారా.. మరేదైనా స్కెచ్ వేశారా? మరి ఆ ప్లాన్ వర్కవుట్ అయితే.. తెలంగాణతో పాటు ఏపీలో లాభపడవచ్చని భావిస్తున్నారా?
తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో పని అయిపోయిందని అందరూ అంటున్న పార్టీ. కానీ… పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం అలా అనుకోవడం లేదు. ఇంకా పార్టీ కోసం పని చేసే కేడర్ ఉందని విశ్వసిస్తున్నారట. వారంలో రెండు రోజులు తెలంగాణలో పార్టీ కోసం కేటాయిస్తున్నారు. ఎలాగైనా పార్టీని మళ్లీ నిలబెట్టాలని ట్రై చేస్తున్నారట. ఇందుకోసం ఏదైనా పార్టీ నుంచి సపోర్టు తీసుకోవాలని భావిస్తున్నారట. అందులో భాగంగా చంద్రబాబు.. తెలంగాణలో బీజేపీని ఎంచుకున్నారని ఇప్పుడు టాక్. ఇక్కడ బీజేపీతో దోస్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఈ మధ్య బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఓ లెటర్ రాశారు చంద్రబాబు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు ఎవరూ లేరనే చెప్పాలి. ఒక ఎమ్మెల్యే ఉన్నా.. ఆయన టీఆర్ఎస్‌కు మద్దతుగానే ఉన్నారంటున్నారు. మరోపక్క బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. కాకపోతే ఆ పార్టీకి నలుగురు ఎంపీల బలం ఉండడంతో రాష్ట్రంలో పుంజుకోవడం పెద్ద కష్టమేమీ కాదని భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి కొన్ని ప్రాంతాల్లో ఎంతో కొంత బలం ఉంది. ఒకప్పుడు బలమైన కేడర్ ఉండేది. అయితే నాయకులంతా వివిధ పార్టీల్లోకి జంపైపోవడంతో కార్యకర్తలంతా చెల్లాచెదురైపోయారు. కొందరు కార్యకర్తలు మాత్రం పార్టీ వెంటే ఉన్నారు. కాకపోతే కొంత వరకూ సైలెంట్‌గా ఉండిపోయారంటున్నారు.
రాష్ట్రంలో బీజేపీతో ఒకవేళ కలిస్తే.. తప్పకుండా టీడీపీ కార్యకర్తలు యాక్టివేట్ అవుతారని చంద్రబాబు భావిస్తున్నారట. ఆ దిశగా ఇప్పటి నుంచే చర్యలు మొదలుపెడుతున్నారని చెబుతున్నారు. బీజేపీకి దగ్గరైతే దూసుకుపోవచ్చని అనుకుంటున్నారట. అందులో భాగంగానే మొన్నా మధ్య కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డికి చంద్రబాబు లేఖ కూడా రాశారు. ఈ లేఖ ద్వారా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టేనని జనాలు అంటున్నారు.
అంతకు ముందు బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జతకట్టిన చంద్రబాబు.. ఈసారి తన పార్టీని నిలబెట్టుకునేందుకు బీజేపీతో కలిసి ముందుకు సాగే అవకాశాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తన బలం పెరిగినట్టుగా బీజేపీ భావిస్తోంది. అదే సమయలో బీజేపీకి కొంత అవకాశం ఉందని తెలుగుదేశం కూడా అనుకుంటోంది. అందుకే రెండు పార్టీలూ కలిస్తే.. తప్పకుండా ఫలితం ఉంటుందని అనుకుంటున్నాయట. ఆ దిశగా ఇప్పటి నుంచే బలమైన సంబంధాలు పెట్టుకుంటే.. భవిష్యత్తులో తప్పకుండా అధికారంలోకి రావచ్చని బావిస్తున్నాయట. అందుకే చంద్రబాబు కూడా వారంలో రెండురోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంటూ.. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారంటున్నారు. మరి ఈ రెండు పార్టీలు కలిస్తే.. ఎంత వరకూ ఫలితం ఉంటుందో చూడాలి.
నిజానికి బాబు గారి ప్లానేందంటే.. తెలంగాణలో బీజేపీతో దోస్తానా వర్కవుట్ అయితే.. దానినే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేసేద్దామని అనుకుంటున్నారట.