లక్ష లోపు రైతు రుణాలు మాఫీ చేస్తాం : సీఎం కేసీఆర్ 

రాష్ట్రంలో రూ.24 వేల కోట్ల రైతు రుణ మాఫీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : January 20, 2019 / 10:40 AM IST
లక్ష లోపు రైతు రుణాలు మాఫీ చేస్తాం : సీఎం కేసీఆర్ 

రాష్ట్రంలో రూ.24 వేల కోట్ల రైతు రుణ మాఫీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

హైదరాబాద్ : రూ.లక్ష లోపు రైతు రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. రూ.24 వేల కోట్ల రైతు రుణ మాఫీ అమలు చేస్తామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరకు సంబంధించి ప్రధానితో మాట్లాడానని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జనవరి 20వ తేదీ ఆదివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యులు మాట్లాడారు. అనంతరం సీఎం కేసీఆర్ సభ్యులు లేవనెత్తిన అంశాలపై సమాధానమిస్తూనే.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. 

సత్యదూరమైన విషయాలు మాట్లాడటం మంచిది కాదని హితవుపలికారు. కంటి వెలుగు కింద ఆపరేషన్లే జరుగలేదు..మరి కళ్లు ఎలా పోతాయని ప్రశ్నించారు. వందకు వంద శాతం ఇది రైతు ప్రభుత్వమని తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రతీ గంటకు భూ రికార్డులను ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తామన్నారు. ధరిణి వెబ్ సైట్ లో భూ రికార్డుల వివరాలు పొందుపర్చుతామని తెలిపారు.

రాష్ట్రంపై రూ.2 లక్షల 140 వేల కోట్ల అప్పు ఉందన్నారు. రోడ్లపై చెత్త వేస్తే రూ.500 ఫైన్ వేస్తామని చట్టం చేశామని తెలిపారు. చాలా విషయాల్లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను తూ.చ తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.