ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : కేసీఆర్

పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ నివాళులర్పించింది. 2 నిమిషాలు మౌనం పాటించారు సభ్యులు. అన్ని పార్టీలు దాడిని ఖండించాయి. సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. వీరజవాన్ల కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం ప్రకటించారు. వారి కుటుంబాలకు ఈ డబ్బు త్వరలోనే అందించటం జరుగుతుందని ప్రకటించారు. 40 మంది బాధిత కుటుంబాలకు సాయం చేయటానికి తెలంగాణ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని వెల్లడించారు.
ఉగ్రవాదాన్ని దేశం నుంచి తరిమికొట్టాలని.. అది ఏ రూపంలో ఉన్నా మంచిది కాదన్నారు. దేశం మొత్తం ఉగ్రవాద చర్యను ఖండిస్తుందని.. అమర జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు.
Read Also: సినిమా రివ్యూ : ఎన్టీఆర్ మహానాయకుడు
Read Also: బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేసీఆర్