హైదరాబాద్ గ్లోబల్ సిటీ : కేసీఆర్ మాస్టర్ ప్లాన్

  • Published By: madhu ,Published On : February 9, 2019 / 03:12 PM IST
హైదరాబాద్ గ్లోబల్ సిటీ : కేసీఆర్ మాస్టర్ ప్లాన్

హైదరాబాద్ : నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.  హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగినట్లు సన్నద్ధం చేసే అంశంపై ప్రగతి భవన్‌లో సమీక్షా నిర్వహించిన కేసీఆర్…నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్ది సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు.

అయితే అలాంటి సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కారాలు చూపే ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. ఇక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో భవిష్యత్తు అవసరాలకు తగినట్టు హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించే మాస్టర్ ప్లాన్‌లో రాష్ట్ర మంత్రివర్గం మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం రూపొందిస్తామని వెల్లడించారు.