తిరు నక్షత్ర మహోత్సవం : సీఎం కేసీఆర్ ధైర్యస్తుడు – చిన జీయర్

  • Published By: madhu ,Published On : October 28, 2019 / 12:20 PM IST
తిరు నక్షత్ర మహోత్సవం : సీఎం కేసీఆర్ ధైర్యస్తుడు – చిన జీయర్

Updated On : October 28, 2019 / 12:20 PM IST

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లోని శ్రీరామనగరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి తిరు నక్షత్ర మహోతవ్సం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా అక్కడకు వెళ్లి..చిన జీయర్ స్వామిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్‌కు..స్వామిజీ మంగళాశాసనములు చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబంతో కలిసి రావడం చాలా సంతోషంగా ఉందని, సత్య సంకల్ప గ్రంథాన్ని బహుకరించడం జరిగిందన్నారు. అద్బుతమైన కార్యక్రమాలు చేస్తూ..రాజకీయ నాయకుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారని ప్రశంసించారు.

పబ్లిక్‌గా అధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి కొంతమంది నేతలు వెనుకంజ వేస్తారని, కానీ కేసీఆర్…అలాంటి వ్యక్తి కాదన్నారు. దేశంలోనే యాదాద్రి క్షేత్రాన్ని అద్బుతంగా తీర్చిదిద్దుతున్నారని, పనులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని మరికొన్ని ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, మఠపల్లి క్షేత్రాన్ని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని..ఈ విషయం తమకు చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 
Read More : హయత్ నగర్‌ మర్డర్ అప్ డేట్ : నిలదీయడంతో కీర్తి నిజం చెప్పింది – తండ్రి