ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
ఆర్టీసీ కార్మికులకు బిగ్ రిలీఫ్. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. డిపోల వారీగా ఈ ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉందని

ఆర్టీసీ కార్మికులకు బిగ్ రిలీఫ్. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. డిపోల వారీగా ఈ ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉందని
ఆర్టీసీ కార్మికులకు బిగ్ రిలీఫ్. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. డిపోల వారీగా ఈ ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే శుక్రవారం(నవంబర్ 22,2019) నుంచి కార్మికులను విధుల్లోకి అనుమతించే ఛాన్స్ ఉందని సమాచారం.
ప్రస్తుతం ప్రగతిభవన్ లో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్ష అనంతరం కార్మికులను విధుల్లోకి తీసుకోవడంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్ జోషి, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదన, కోర్టు ఆదేశాలు, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంశాలపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు.
45 రోజల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు.. పట్టు వీడారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచారు. సమ్మెకి ముందున్న పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. కార్మికులు ఎలాంటి పేపర్లపై సంతకాలు పెట్టరని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సమాలోచనలు జరుపుతున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.