మనది డైనమిక్‌ రాజ్యాంగం : సీఎం కేసీఆర్‌

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 05:14 AM IST
మనది డైనమిక్‌ రాజ్యాంగం : సీఎం కేసీఆర్‌

Updated On : November 26, 2019 / 5:14 AM IST

నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోతవ్సం. ఈసందర్భంగా రాజ్ భవన్ లో జరగుతున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ..మన భారతదేశానిది డైనమిక్ రాజ్యాంగమని ప్రశంసించారు. రాజ్యాంగం ఏర్పడిన తరువాత ఎన్నో మార్పులు..చేర్పులు చేసుకున్నామనీ..ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది. 

మన రాజ్యాంగం 7 దశాబ్దలుగా పరిపుష్టంగా కొనసాగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తితో మన కర్తవ్యాన్ని నిర్వహించుకుందాం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మనకు ఎన్నో హక్కుల్ని కల్పించిన రాజ్యాంగాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నందుకు గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. 

రాజ్‌భవన్‌లో భారత రాజ్యాంగ 70వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, సీఎం కేసీఆర్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  భారత రాజ్యాంగ రూపకర్త డాక్డర్ బీంరావ్ రాంజీ అంబేడ్కర్‌, మహాత్మా గాంధీ చిత్రపటాలకు గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు.