తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరో యాగం చేయనున్ననట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరో యాగం చేయనున్ననట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరో యాగం చేయనున్ననట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక పూజలు నిర్వహించాలని భావిస్తున్నారు. మంగళవారం (డిసెంబర్ 31, 2019) వాస్తు నిపుణులతో కలిసి సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ను పరిశీలించారు. యాగం నిర్వహణ కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు.
అలాగే తెలంగాణ భవన్ లో జరుగుతున్న నూతన నిర్మాణ పనుల్లో సీఎం పలు మార్పులు సూచించారు. క్యాంటీన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ భవన్ లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. వాస్తు నిపుణులు సూచించిన విధంగా తెలంగాణ భవన్ లో మార్పులు చేర్పులు చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమై సూచనలు చేశారు.
తెలంగాణ భవన్ కు సమీపంలో నిర్మిస్తున్న క్యాంటీన్ నిర్మాణం పనులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. త్వరలో క్యాంటీన్ అందుబాటులోకి రావాలని తెలంగాణ భవన్ కార్యాలయం ఇన్ ఛార్జ్ కు ఆదేశాలు జారి చేసినట్లు తెలుస్తోంది. రాబోయే కొన్నిరోజుల్లో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో యోగం చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎం కేసీఆర్ అయుత చండీయాగంతోపాటు పలు యాగాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.