పూర్తిగా ప్రైవేట్ పరం చేయం, 3 రకాలుగా విభజిస్తాం : ఆర్టీసీపై సీఎం సంచలన నిర్ణయం

ఆర్టీసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్.. కొత్త పాలసీకి రూపకల్పన చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం(అక్టోబర్ 7,2019) ఆర్టీసీ సమ్మె, కొత్త

  • Published By: veegamteam ,Published On : October 7, 2019 / 03:50 PM IST
పూర్తిగా ప్రైవేట్ పరం చేయం, 3 రకాలుగా విభజిస్తాం : ఆర్టీసీపై సీఎం సంచలన నిర్ణయం

Updated On : October 7, 2019 / 3:50 PM IST

ఆర్టీసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్.. కొత్త పాలసీకి రూపకల్పన చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం(అక్టోబర్ 7,2019) ఆర్టీసీ సమ్మె, కొత్త

ఆర్టీసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్.. కొత్త పాలసీకి రూపకల్పన చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం(అక్టోబర్ 7,2019) ఆర్టీసీ సమ్మె, కొత్త పాలసీపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సునీల్ శర్మ కమిటీ నివేదికపై సుమారు 4 గంటలు చర్చించారు. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటుపరం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆర్టీసీ సంస్థ ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

ఆర్టీసీని మూడు రకాలు విభజించాలని నిర్ణయించారు. 50శాతం(5,200) బస్సులు ఆర్టీసీలో నడపనున్నారు. ఇందులో 30శాతం(3,100) అద్దె బస్సులు, మరో 20శాతం పూర్తి ప్రైవేట్ బస్సులు నడపాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ప్రైవేట్ స్టేజ్ క్యారేజీకి అనుమతి ఇస్తామన్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల ఛార్జీలు ఒకేలా ఉంటాయన్నారు. క్రమ శిక్షణతో ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తామన్నారు. ఆర్టీసీ మొత్తాన్ని ప్రైవేట్ పరం చేయడం వివేకమైన చర్య కాదన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. ఆర్టీసీ ఎండీ కొనసాగుతారని చెప్పారు.  

ఆర్టీసీ యూనియన్ల అతి ప్రవర్తన వల్లే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ అన్నారు. తాము ఎక్కిన చెట్టు కొమ్మలు తామే నరుక్కున్నారని ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. సమ్మెని తీవ్రతరం చేస్తామనడం హాస్యాస్పదం అన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న సిబ్బంది కేవలం 1200మంది మాత్రమే అని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగులను ప్రభుత్వం డిస్మస్ చేయలేదన్న కేసీఆర్.. వాళ్లంతట వాళ్లే తప్పుకున్నారని చెప్పారు. గడువులోగా విధుల్లో చేరని వాళ్లు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని వెల్లడించారు. ఇక ముందు కూడా సబ్సిడీ బస్ పాస్ లు కొనసాగుతాయని సీఎం చెప్పారు. ఇకపై ఆర్టీసీలో యూనియన్ల ప్రసక్తే ఉండదన్న సీఎం.. యూనియనిజం అనేది ఉండదని తేల్చి చెప్పారు. ఆర్టీసీ ప్రక్షాళన చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారని సీఎం అన్నారు. డిపోలు, స్టేషన్ల దగ్గర గొడవలు చేయకుండా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ఆర్టీసీకి కొత్త నెత్తురు, జవసత్వాలు రావాలని సీఎం ఆకాంక్షించారు. ఇష్టం వచ్చిన రీతిలో సమ్మె చేస్తామనం దురహంకారం అని మండిపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఏ సంస్థలోనైనా ఏది జరిగినా ప్రభుత్వ ఆనుమతితోనే జరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విధుల్లోకి రానివారు ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు యూనియన్లు వాటి అస్థిత్వాన్ని కోల్పోయాయన్నారు. భవిష్యత్ లో ఆర్టీసీ అద్భుతమైన సంస్థగా రూపు దిద్దుకుంటుందన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చి కార్మికులకు బోనస్ ఇచ్చే పరిస్థితి రావాలన్నారు.

* ప్రస్తుతం ఆర్టీసీలో 10వేల 400 బస్సులు
* భవిష్యత్ లో 3 రకాలుగా విభజన
* 50శాతం బస్సులు అంటే 5వేల 200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవి
* 30శాతం బస్సులు అంటే 3వేల 100 బస్సులు అద్దెకి 
* వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే ఉంచుతాం
* అద్దెకి తీసుకున్న బస్సులు, స్టేజ్ క్యారేజ్ బస్సులు ఇతర రూట్లతో పాటు నగరంలోనూ నడపాలి
* ఇప్పటికే 21శాతం అద్దె బస్సులను ఆర్టీసీ నడుపుతోంది
* ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా 9శాతం మాత్రమే
* 9శాతం అద్దె బస్సులను పెంచడం అంటే కొత్త బస్సులు వచ్చినట్లే