ఇంటికో ఉద్యోగం ఇస్తామని నేనెప్పుడు చెప్పలేదు : సీఎం కేసీఆర్
ఇంటికో ఉద్యోగం ఇస్తామని తానెప్పుడు చెప్పలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం వద్ద అన్ని ఉద్యోగాలు ఉండవని మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామని తానెప్పుడు చెప్పలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం వద్ద అన్ని ఉద్యోగాలు ఉండవని మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని తానెప్పుడు చెప్పలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం వద్ద అన్ని ఉద్యోగాలు ఉండవని మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు. అనని మాటను అన్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అన్నారు.
ఎన్నో రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. ఆరేళ్లలో ఒకసారి మాత్రమే విద్యుత్ ఛార్జీలు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ను కొనసాగిస్తామని చెప్పారు. అప్పు చేసి విద్యుత్ ఇస్తున్నందు వల్ల ఛార్జీలు పెరుగుతాయన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారని అన్నారు.
120 స్థానాలకు గానూ అసెంబ్లీలో తమకు 90 మంది ఎమ్మెల్యేలున్నారని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో కలిసి పనిచేస్తామని వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాకను నేను నిరాకరించలేను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు వస్తే కలిసిపనిచేసేందుకు ఆహ్వానించామని తెలిపారు. రెండింట మూడొంతుల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయ్యారని తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా తమతో కలిసి పని చేస్తున్నారని చెప్పారు.