వణికిస్తున్న చలిగాలులు : రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఈశాన్యం నుంచి జోరుగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

తెలంగాణలో ఈశాన్యం నుంచి జోరుగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
తెలంగాణలో ఈశాన్యం నుంచి జోరుగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలికి జనం గజగజలాడుతున్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో 11.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 12 డిగ్రీలకు పడిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి.
దీంతో పలు ప్రాంతాల్లో రాత్రిపూట చలి తీవ్రమయ్యింది. ఉదయం పొగమంచు కమ్ముకుంటుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. వచ్చే మూడ్రోజులు రాష్ట్రం లో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వెల్లడించింది.
కోస్తాపైకి తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. అయితే తూర్పుగాలుల ప్రభావం కొంతమేర తగ్గడంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా వుంటుందని వెల్లడించింది. ఈశాన్య గాలులతో ఉత్తర కోస్తాలో చలి స్వల్పంగా పెరిగింది. అయితే మేఘాలు ఆవరించడంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.