కాంగ్రెస్ నేత నుంచి రూ. రూ.10లక్షలు స్వాధీనం

ఎన్నికలు జరిగేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. పోలింగ్ కు కొంత సమయమే ఉండటంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా కొండా సందీప్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.10లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండా సందీప్ రెడ్డి చేవెళ్లకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థఇ కొండా విశ్వేశ్వర రెడ్డి అనుచరుడిగా పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి విశ్వేశ్వర రెడ్డి తరపున డబ్బులు పంచుతున్నాడని భావిస్తున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కారులో ఉన్న రూ.10 లక్షలతో పాటు నగదురు పంపిణీ చేసిన లెక్కలకు సంబంధించిన పేపర్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎన్నికల్లో ఇప్పటి వరకూ కోట్ల రూపాయలు డబ్బు పంపిణీ చేసినట్లుగా సందీప్ రెడ్డి వద్ద స్వాధీనం చేసుకున్న పేపర్స్ ద్వారా ఆధారాలతో తెలుస్తోంది. కాగా ఇప్పటికే నగంలో పోలీసులు చేపట్టిన తనిఖీలలో కొన్ని కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన విషయం తెలిసిందే.