గుడ్ న్యూస్ : సంక్రాంతికి మరో 14 ప్రత్యేక రైళ్లు

  • Published By: madhu ,Published On : January 2, 2019 / 04:11 AM IST
గుడ్ న్యూస్ : సంక్రాంతికి మరో 14 ప్రత్యేక రైళ్లు

Updated On : January 2, 2019 / 4:11 AM IST

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. సొంతూళ్లకు వెళ్లేందుకు జనాలు సిద్దమౌతున్నారు. పెట్టె…బ్యాగులు సర్దేస్తున్నారు. పండుగ నేపథ్యంలో బస్సులు..రైళ్లు కిటకిటలాడుతుంటాయి. ముందే టికెట్లు బుక్ చేయించుకోవడానికి రిజర్వేషన్ కౌంటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అప్పటికే ఫుల్‌గా టికెట్లు రిజర్వేషన్ అయిపోతుండడంతో ప్రయాణీకులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ పండుగను క్యాష్ చేసుకొనేందుకు అటు ఆర్టీసీ..ఇటు రైళ్ల శాఖలు ఛార్జీలను పెంచేశాయి. 

14 ప్రత్యేక  ఛార్జీల రైళ్లు…
పండుగకు ఊరికి వెళ్లడం…తిరిగి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుందని..ఈ పండుగలో రద్దీ విపరీతంగా ఉంటుందని గ్రహించిన దక్షిణ మధ్య రైల్వే మరో 14 ప్రత్యేక ఛార్జీల రైళ్లను నడుపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. 13 ప్రత్యేక రైళ్లలో 11 సర్వీసులు భారీ ఛార్జీలుండే సువిధ ప్రత్యేక రైళ్లున్నాయి. ఇందులో టికెట్లు అయిపోయే కొద్ది ఛార్జీలు పెరుగుతూ ఉంటాయి. ఈ రైళ్లలో రెండు మినహా మిగిలినవి ఆంధ్రప్రదేశ్‌‌లోని వివిధ ప్రాంతాలకు నడుపనున్నారు. 
కాకినాడ టౌన్ స్టేషన్ నుండి సికింద్రాబాద్‌కు ఏడు, నర్సాపూర్ నుండి సికింద్రాబాద్‌కు మూడు, విజయవాడ నుండి సికింద్రాబాద్‌కు ఒకటి, సికంద్రాబాద్ నుండి కాకినాడకు రెండు ప్రత్యేక ఛార్జీల రైలు సర్వీసులు తిరగనున్నాయి. 

  • విజయవాడ – సికింద్రాబాద్ : సువిధ 17న ఒకటి. 
  • సికింద్రాబాద్ – కాకినాడ : ప్రత్యేక ఛార్జీల రైళ్లు 13 , 20 తేదీల్లో ఒకటి. 
  • కాకినాడ – సికింద్రాబాద్ : సువిధ రైళ్లు 16 , 17, 20 తేదీల్లో 2, 18న ఒకటి. 
  • నర్సాపూర్ – సికింద్రాబాద్ : సువిధ 18, 19, 20 తేదీల్లో ఒకటి.