ORRపై ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు లేటెస్ట్ టెక్నాలజీ

ORRపై ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు లేటెస్ట్ టెక్నాలజీ

Updated On : October 29, 2019 / 6:39 AM IST

హైదరాబాద్‌లో ORR(ఔటర్ రింగు రోడ్డు)పై ప్రమాదాలను నివారించడానికి హెచ్ఎండీఏ(హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ ట్రాఫిక్ మేనెజ్‌మెంట్ సిస్టమ్ ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లు వాహనదారులకు రెండు వారాల్లో అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీ ద్వారా వాహనాల వేగాన్నితగ్గించడం, మార్గంలో ముందు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే 
ముందుగానే వాహనాదారులకు హెచ్చరికలు జారీ చేయడానికి స్క్రీన్ బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

వీటిలో భాగంగానే 158 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్న ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్ ఛేంజీలు ఉంటాయి. ఇంటర్ ఛేంజీలు జరిగేటప్పుడు, ముందుగా వున్న రోడ్డు మరమ్మతు పనులు, వాహానాల వేగం వంటి అంశాలను స్కీన్ బోర్డులో డిస్ ప్లే అయ్యేలా ఏర్పాటుచేస్తారు. దీనివల్ల ఎన్ని వాహనాలు ప్రయాణిస్తున్నాయో కూడా తెలుసుకోవచ్చు.

ఔటర్ రింగ్ రోడ్డులో ఏవైనా ప్రమాదాలు జరిగితే ప్రమాదాన్ని గురించి సమాచారం ఇవ్వటానికి రోడ్డుకి ఇరువైపులా కాల్ బటన్ లు ఏర్పాటు చేస్తారు. వీటిని నొక్కితే సమయాన్ని బట్టి దగ్గర్లో ఉన్న సిబ్బందిని అలర్ట్ చేసి వారిని కాపాడతారు. సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల ప్రమాదాలు జరగకుండా చూడడంతో పాటు, చోరి చేసి పారిపోయిన వ్యక్తులను కూడా త్వరగా పట్టుకునేందుకు ఉపయోగపడతాయి. ఈ టెక్నాలజీని నానక్ రామ్ గూడ కంట్రోల్ రూం కి కనెక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచే వాహానాదారులకి హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తారు. 

సైన్ స్క్రీన్ బోర్డుల్లో ఉండే సమాచారం:
158 కిలో మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్ ఛేంజింగులు ఉంటాయి. ప్రతి 1.3 కిలోమీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపులా ఈ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇవి 10 జాతీయ రహదారులతో కలువుతున్నాయి. రింగ్ రోడ్డులపై పొగ మంచు, భారీ వర్షాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ సమయాల్లో డ్రైవర్లకు సూచనలు చేయటానికి ఉపయోగపడుతాయి.