దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సీపీఐ నారాయణ క్షమాపణలు

  • Published By: vamsi ,Published On : December 8, 2019 / 06:25 AM IST
దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సీపీఐ నారాయణ క్షమాపణలు

Updated On : December 8, 2019 / 6:25 AM IST

దిశ హత్యాచార ఘటనలో నిందితులు నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్  చేయటంపై శుభం సంతోషం అంటూ స్పందించడంపై సీపీఐ నేత నారాయణ క్షమాపణ చెప్పారు. సంచలనం రేపిన ఈ ఎన్‌కౌంటర్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నారాయణ వ్యాఖ్యలను పలువురు సభ్యులు తప్పుబట్టడంతో పార్టీకి, ప్రజలకు నారాయణ బహిరంగ క్షమాపణలు తెలిపారు.

పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడంపై ప్రజలకు, పార్టీ నాయకులను క్షమించమరి కోరారు నారాయణ. మహిళలపై ఇలాంటి అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే  ఇలాంటి చర్యలు తప్పవని నారాయణ అభిప్రాయపడగా.. ఆ పార్టీ నాయకులు సీతారామ్ ఏచూరి లాంటి వాళ్లు ఎన్‌కౌంటర్‌ను తప్పుబట్టారు.

‘దిశ’ హత్యాచార నిందితులు ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులులను పోలీసులు.. చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నప్పుడే పారిపోడానికి ప్రయత్నించగా.. ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.