డేటా లీక్ కేసుపై తెలంగాణ పోలీసులు : ఏపీ పెద్దలు ఉన్నా వదిలేది లేదు

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ గ్రిడ్ కేసు ప్రపంకనలు సృష్టిస్తోంది. డేటా లీక్‌పై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేపట్టారు. ఈ కేసులో ఎవరున్నా వదిలేది లేదని..ఏపీ పెద్దలు ఉన్నా వదలమని సైబరాబాద్ సీపీ వెల్లడించారు. ఐటీ గ్రిడ్స్‌పై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అమెజాన్‌కు నోటీసులు జారీ చేశారు. ఐటీ గ్రిడ్ సర్వీస్ నుండి సేవా మిత్ర యాప్‌కు ఇంటిగ్రేడ్ చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ వెబ్ సైట్‌లోని వివరాలే సేవా మిత్ర యాప్‌లో ఉన్నట్లు, ఈ యాప్ డేటాను అమేజాన్ వెబ్ సర్వీసులో ఐటీ గ్రిడ్స్ భద్రపరుచుకుంది. డేటా వివరాలను వారం రోజుల్లో ఇవ్వాలని అమేజాన్ వెబ్ సర్వీసుకు నోటీసులు జారీ చేశారు. మార్చి 04వ తేదీ సోమవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.
Also Read : అభినందన్ దేశభక్తి : డిశ్చార్జ్ చేయండి.. విధుల్లో చేరాలి
తమకు వచ్చిన ఫిర్యాదుతో మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయ్పప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్ డేటాను దుర్వినియోగం చేస్తుందనే సమాచారంతో అక్కడ తనిఖీలు చేసి, నలుగురు ఉద్యోగస్తులతో పాటు మరో ముగ్గురిని ప్రశ్నించినట్లు చెప్పారు. అక్కడ దొరికిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ గాజిట్స్, ఇతరత్ర వాటిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఎవరు ఎంతపెద్ద వ్యక్తులున్నా వదిలే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పారు.
ఏసీపీకి సంబంధించిన పోలీసులు ఇక్కడకు వచ్చి లోకేష్ రెడ్డిని ఎందుకు బెదిరించాల్సి వచ్చిందని, దీనిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read : పాక్ కు బుద్ధి చెప్పాల్సిందే : ఐరాస వద్ద నిరసల హోరు
ఏపీ ప్రభుత్వ పని తీరుపై అనుమానం ఉందన్న ఆయన డేటా సర్వర్ నుండి మూడున్నర కోట్ల ప్రజల వ్యక్తిగత డేటాను డౌన్లోడ్ చేసి హార్డ్ డిస్కుల్లో ఐటీ గ్రిడ్స్ సేవ్ చేసిందన్నారు. ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే విషయం కూడా ఉందన్నారు. ప్రజల సమాచారాన్ని ఎలా మిస్ యూజ్ చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే పోస్టులు పెడితే, లోకేశ్వర్ రెడ్డిని వేధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ వెల్లడించారు.
– ‘పౌరుల వ్యక్తిగత డేటా ఆక్రమంగా సేకరించిన మాదాపూర్ లోని ఐటి గ్రిడ్స్ ఇండియా సంస్థలో సోదాలు. మార్చి 2వ తేదీన తుమ్మల లోకేశ్వర రెడ్డి మాదాపూర్ పోలీసులకు పిర్యాదు చేశారు. సేవ మిత్రా యాప్ లో అక్రమంగా పౌరుల వ్యక్తిగత డేటా సేకరించి ఐటీ గ్రిడ్స్ సంస్థ దుర్వినియోగం చేస్తోందని పిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో 120బి, 379, 420,188 ఐపీసీ, 72&66బి ఐటి యాక్ట్ లు పెట్టాం. రెండు రోజులు ఐటి గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు చేశాం.
– ఐటి గ్రిడ్స్ ఉద్యోగులు రెగొండ భాస్కర్,కందులూరి ఫణికుమార్, రెబ్బల విక్రమ్ గౌడ్, గురుడు చంద్రశేఖర్లను విచారించాం. సోదాల్లో ఐబాల్, డెల్ సీపీయూ, జెబ్రానిక్ సీపీయూ, బ్లాక్ కలర్ డెల్, బ్లాక్ కలర్ ఎం క్యాబ్ సిరిస్ లను సీజ్ చేశాం
– హర్డ్ డిస్క్,ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను సీజ్ చేశాం. సేకరించిన డేటా బెస్ ను అమెజాన్ వెబ్ సర్వీసెస్లో పొందుపరిచారు.
– ఐటి గ్రిడ్స్ సంస్థ పౌరుల ఆధార్, ఓటర్ల జాబితా, పథకాల లబ్దిదారుల వివరాలను సేకరించారు. ఐటి గ్రిడ్స్ సంస్థ సేవ మిత్రా యాప్ ను నిర్వహిస్తోంది.
– నియోజకవర్గాల వారిగా డేటాను సేకరించి, టీడీపీ, వైఎస్ ఆర్ సీపీ, జనసేనకు ఓటు వేస్తున్నారా, స్వతంత్రంగా ఉన్నారా? అన్నడేటా సేకరించారు. ఓటర్ల కులం, అడ్రస్ సేకరించారు. విచారణలో ఐటి గ్రిడ్ సంస్థ డేటా ను దుర్వినియోగం చేస్తోంది. ఈ డేటా ఆధారంగా ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించారా అన్నది విచారించాలి
– అమెజాన్ వెబ్ సర్వీసెస్ నోటీసులు జారీ చేశాం
– ఎన్నికల సంఘానికి,ఆధార్ ప్రాధికారిక సంస్థకు లేఖలు రాస్తాం
– సేకరించిన డేటా అంతా ఏఫ్ ఎస్ ఎల్ కు పంపిస్తాం. చట్టప్రకారం బాధ్యులపై చర్యలు ఉంటాయి’.అని సైబరాబాద్ సీపీ వెల్లడించారు.
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం