లెక్క తప్పింది: తెలంగాణలో ‘డిడి యాదగిరి’ ఎక్కడ?

దేశవ్యాప్తంగా దూర్ దర్శన్ యాదగిరి (డిడి యాదిగిరి)కి చోటు దక్కలేదు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో డిడి యాదగిరి ఛానల్ ఇక చూడలేం. ఎందుకంటే..

  • Published By: sreehari ,Published On : January 28, 2019 / 02:12 PM IST
లెక్క తప్పింది: తెలంగాణలో ‘డిడి యాదగిరి’ ఎక్కడ?

Updated On : January 28, 2019 / 2:12 PM IST

దేశవ్యాప్తంగా దూర్ దర్శన్ యాదగిరి (డిడి యాదిగిరి)కి చోటు దక్కలేదు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో డిడి యాదగిరి ఛానల్ ఇక చూడలేం. ఎందుకంటే..

ట్రాయ్ రూల్స్ కింద అందించే తప్పనిసరి ఛానళ్లలో దేశవ్యాప్తంగా దూర్ దర్శన్ యాదగిరి (డిడి యాదగిరి)కి చోటు దక్కలేదు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో డిడి యాదగిరి ఛానల్ ఇక చూడలేం. ఎందుకంటే.. TRAI కొత్త నిబంధనల ప్రకారం.. ఛానల్స్ డిస్ట్రిబ్యూటర్లు 26 దూరదర్శన్ ఛానల్స్ ను తప్పనిసరిగా ఇవ్వాలి. కస్టమర్లు కూడా నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్ సీఎఫ్) కింద ట్రాయ్ ఇచ్చే 100 చానల్స్ జాబితాలో ఈ 26 డీడీ ఛానల్స్ కచ్చితంగా తీసుకొని తీరాలి. ట్రాయ్ జాబితా ప్రకారం.. NCF ఫార్ములా ఫీజు కింద కస్టమర్ల నుంచి రూ.130 ఛార్జ్ చేస్తారు. ఇది అందరికి కామన్. ఈ జాబితాలో దూరదర్శన్ ఛానల్స్ అన్నీ కలిపారు. కానీ, దూరదర్శన్ యాదగిరి ఛానల్ మాత్రం తొలగించారు. దీంతో దేశవ్యాప్తంగా దూరదర్శన్ యాదగిరి ఛానల్ అందుబాటులో లేకుండా పోయింది.

అసలు 26.. ఇచ్చేది 25 మాత్రమే.. 
ఎమ్ఎస్ఓ(MSO)లు ఇవ్వాలని భావిస్తే తప్ప దూరదర్శన్ యాదగిరి తెలంగాణలో చూసే అవకాశం ఉండదు. ట్రాయ్ అధికారిక వెబ్ సైట్ లో సూచించిన ఛానెల్ బొకేలు ఎలా ఎంచుకోవాలో జాబితాను ఉంచింది. TRAI న్యూ రూల్స్ .. పంపిణీదారులు 26 దూరదర్శన్ ఛానళ్లను తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ ఛానల్స్ జాబితాలో 25 ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో డిడి సిమ్లా ఛానల్ తో పాటు డిడి యాదగిరి (DD Yadagiri) ఛానల్ ఎక్కడా లేదు. దీనిపై టీవీ ప్రేక్షకులకు ఎన్నో ప్రశ్నలు రేకిత్తిస్తుండటంతో వారి సందేహాలను నివృతి చేయాలనే ఉద్దేశంతో ట్రాయ్ 100 ఛానల్స్ ఎంపిక పై వివరణ ఇచ్చింది. ఇందులోనూ దూరదర్శన్ యాదగిరి లేదు.

నో గెజిట్ నోటిఫికేషన్.. స్పందన శూన్యం..
నిజానికి కొత్త ఛానల్ యాడ్ చేసినప్పుడు గెజెట్ నోటిఫికేషన్ జారీచేయాలి. డిడి కిసాన్ ఛానల్ వచ్చి చేరినప్పుడు కూడా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఆ గెజెట్ నోటిఫికేషన్ ను జతచేసి సమాచారం ఇచ్చింది. కానీ దూరదర్శన్ యాదగిరి విషయంలో అలాంటి సమాచారమేదీ ఇవ్వలేదు. దీనిపై కొందరు డ్రిస్టిబ్యూటర్లు, ట్రాయ్, ఎంఐబి (MoI&B) దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యం.

టీఎస్ ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే..
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ట్రాయ్ స్పందించే అవకాశం లేదని తెలుగు రాష్ట్రాల పంపిణీదారులు అభిప్రాయపడుతున్నారు. NCF ఫీ కింద ఇచ్చే తప్పనిసరి 100 ఛానెళ్లలో ఇప్పుడు డిడి యాదగిరి ఛానల్ కూడా ఒకవేళ కలిపితే వ్యూయర్స్ చాయిస్ 73కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తే తప్ప సమస్య కొలిక్కి వస్తుందో లేదో చెప్పలేం. 

For full Details : తప్పనిసరి ఛానళ్ల ప్యాకేజీ జాబితా ఇదే..