ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు
టీఎస్ ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై కార్మిక సంఘాల నేతలు వేర్వేరుగా సమావేశం అయ్యారు.

టీఎస్ ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై కార్మిక సంఘాల నేతలు వేర్వేరుగా సమావేశం అయ్యారు.
టీఎస్ ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై కార్మిక సంఘాల నేతలు వేర్వేరుగా సమావేశం అయ్యారు. జేఏసీ నేతలు జిల్లాల వారీగా కార్మికుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. సమ్మె కొనసాగించడంపై కార్మికుల మధ్య ఏకాభిప్రాయం కుదురడం లేదు. లేబర్ కోర్టులో తేలడానికి సమయం పడుతుందని కొందరు కార్మికులు ఆవేదన చెందుతున్నారు. మరికొందరు కార్మికులు సమ్మెను కొనసాగించాలని పట్టుబడుతున్నారు.
ఆర్టీసీ సమ్మె కొనసాగింపు, సమ్మె విరమణకు సంబంధించి కార్మిక సంఘాలు ఏటూ తేల్చుకోలేకపోయాయి. నిన్న హైకోర్టు డైరెక్షన్స్ పై ఏం చేయాలన్న అంశంపై ఆర్టీసీ జేఏసీలోని ముఖ్య కార్మిక సంఘాలు వారి వారి కార్మిక సంఘాలు, డిపో నాయకులు, జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. ఒకవైపు టీఎంయూ మీటింగ్ కొనసాగుతుంటే మరోవైపు ఎల్ బీ నగర్ లో ఎంప్లాయిస్ మీటింగ్ కొనసాగుతుంది. ఇంకొకవైపు ఎస్ డబ్ల్యుఎఫ్ కార్మిక సంఘాల సమావేశం కొనసాగుతోంది. సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి.
సమ్మె 46 రోజుకు చేరుకుంది. ఇప్పటికే ఒక మెట్టు దిగి విలీనం అంశాన్ని పక్కన పెట్టినా ప్రభుత్వం దిగిరాక పోవడం, హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఏం చేయాలన్న అంశంపై జేఏసీ ముఖ్య నాయకులు కింది స్థాయి కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కార్మికులు మాత్రం సీరియస్ గా 46 రోజులగా సమ్మె చేస్తున్నామని, రెండు నెలల జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని, సమ్మె కొసాగించాలని మెజార్టీ వర్గం చెబుతున్నారు. ముఖ్య నాయకులు మాత్రం మన పరిధి దాటి పోయింది కాబట్టి, కార్మికుల హక్కులు, చట్టంపై హైకోర్టులో తేల్చుకోలేకపోయామని, లేబర్ కోర్టుకు తమ సమస్య పరిష్కారాన్ని బదిలీ చేసింది కాబట్టి లేబర్ కోర్టు ఏం చేయబోతుంది. ఏం జరుగుతుంది చూడాలన్నారు.
సమ్మె విరమించి ఒకవేళ విధుల్లో చేరితే ఆర్టీసీ యాజమాన్యం 49 వేల 200 మంది కార్మికులను తీసుకుంటారో, లేదో అన్న ప్రశ్న మొదలైంది. కార్మికుల్లో అంతర్మథనం మొదటైంది. కార్మిక సంఘాల నాయకుల్లో భయం అనేది మొదలైంది. తాము ఎలాగైన సమ్మె విరమణ చేస్తే రేపటి పరిస్థితి ఎలా ఉంటుందని, ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకుంటుందా, లేదా ఏదైనా కండీషన్ పెట్టి విధుల్లోకి తీసుకుంటే, ఎలాంటి పరిణామాలు ఉంటాయని ఆందోళన చెందుతున్నారు.
ఇన్నాళ్లు చేసిన విధులు కాల గర్భంలో కలిసే అవకాశముందని వాపోతున్నారు. లేబర్ కోర్టులో పరిణామాలు, ప్రభుత్వం అనుసరించే తీరుపై కార్మిక సంఘాల నేతలు వారి వారి కార్మిక సంఘాల నేతలతో చర్చిస్తున్నారు. సాయంత్రం వరకు ఒక నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.