నిందితులకు తగిన శిక్ష పడింది : దిశ తల్లిదండ్రులు

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు నలుగురు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. సీన్ రీ కనస్ట్రక్షన్ సందర్బంలో పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
షాద్‌నగర్ కోర్టు ఆదేశం మేరకు పోలీసులు చర్లపల్లి జైలు నుండి నిందితులను కస్టడీకి తీసుకోగా.. చర్లపల్లి జైలు నుంచి తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్లు దృవీకరించారు సీపీ సజ్జనార్
ఈ క్రమంలోనే దిశను పెట్రోల్ పోసి చంపిన చోటే వారిని ఎన్‌కౌంటర్ చేశారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయగా.. ఈ ఘటనపై దిశ తల్లిదండ్రులు స్పందించారు. దోషులకు తగిన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు.