పాకిస్తాన్ నుంచి వచ్చినా సరే. నా ప్రాణమున్నంత వరకూ మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు

పాకిస్తాన్ నుంచి వచ్చినా సరే. నా ప్రాణమున్నంత వరకూ మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు

Updated On : February 29, 2020 / 1:50 AM IST

CAAపై టీఆర్ఎస్ ఎమ్మల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చినా మరింకెక్కడి నుంచి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఏం చేయరంటూ హామీ ఇచ్చారు. ముస్లిం గ్రూపుతో సమావేశంలో పాల్గొన్న ఆయన పౌరసత్వ చట్టం(సీఏఏ)పై స్పందించారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సీఏఏను వ్యతిరేకిస్తుందంటూ స్పష్టం చేశారు. 

‘ఎటువంటి పురాతనమైన ప్రదేశాల నుంచి వచ్చినా మా ప్రాణమున్నంత వరకూ మిమ్మల్ని ఎవరూ వెనక్కి పంపరు’ అని TRS శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం భారత్ నుంచి వెళ్లిపొమ్మని ఎటువంటి సమస్యలు సృష్టించదు. ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే టీఆర్ఎస్ నాయకులను కలవాలని సూచించారు. 

వీటిపై బీజేపీ తెలంగాణ నాయకులు పోలీస్ కంప్లైంట్ చేశారు. సీఏఏపై అంతర్గత సర్వే అంటూ శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు తిరగడం మొదలుపెట్టారు. వాటికి స్పందిస్తూ ఎటువంటి దరఖాస్తులు పూర్తి చేయొద్దని పిలుపునిచ్చారు. గురువారం గాంధీ చేసిన కామెంట్ల వీడియో వైరల్ అయింది. మళ్లీ వాటిపై వివరణ ఇస్తూ.. ముస్లింలలో కాన్ఫిడెన్స్ పెంచడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.  

ఎన్నార్సీ సర్వే నిర్వహిస్తుండటంలో ప్రజల్లో ఆందోళన మొదలవుతుందని అలా మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘అందుకే నేను వాళ్లని పిలిపించాను. పాకిస్తాన్ అని మాట వరుసకు మాత్రమే అన్నాను కానీ, నా ఉద్దేశ్యం అది కాదని’ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ శేరిలింగంపల్లి కన్వీనర్ పీ.బుచ్చి రెడ్డి, ఇతర పార్టీ నాయకులతో కలిసి కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లో వివాదాస్పద వ్యాఖ్యలంటూ పోలీస్ కంప్లైంట్ చేశారు.