బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా విడుదల

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో చనిపోయిన.. తెలంగాణకు చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించింది.

  • Published By: veegamteam ,Published On : October 25, 2019 / 04:15 PM IST
బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా విడుదల

Updated On : October 25, 2019 / 4:15 PM IST

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో చనిపోయిన.. తెలంగాణకు చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించింది.

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో చనిపోయిన.. తెలంగాణకు చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. మొత్తం 12 మందికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున కోటీ 20 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా డబ్బులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్వర్తులు జారీ చేసింది.

కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు ధర్మాడి సత్యం బృందం. ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత బోటు బయటపడింది. బోటులో నుంచి 5 మృతదేహాలు కూడా బయటపడ్డాయి. 38 రోజులుగా మృతదేహాలు బోటులోనే ఉన్నాయి. మిగతా మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మంగళవారం(అక్టోబర్ 22,2019) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ధర్మాడి టీమ్ బోటుని నీటి లోపలి నుంచి వెలికితీసింది.

తీవ్ర ప్రయత్నాలు తర్వాత బోటుని నీళ్లపైకి తీసుకొచ్చింది ధర్మాడి సత్యం బృందం. లంగర్లు, ఐరన్ రోప్స్ సాయంతో బోటుని వెలికితీశారు. ఉచ్చుకి చిక్కిన బోటు పైకి తేలింది. రాయల్ వశిష్ట టూరిస్ట్ బోటు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉంది. ధర్మాడి టీమ్ రెండు విడతల్లో బోటు ఆపరేషన్ చేపట్టింది. డీప్ సీ డైవర్ల సాయంతో బోటుకి ఉచ్చు బిగించడంలో సక్సెస్ అయ్యారు.

సెప్టెంబర్ 15న కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదం జరిగింది. గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండలు వెళ్తుండగా బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 77మంది టూరిస్టులు ఉన్నారు. ప్రమాదం నుంచి 26మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 44 మృతదేహాలు వెలికితీశారు. మరో 7 మృతదేహాల కోసం గాలిస్తున్నారు.