ఉద్యోగులకు గుడ్ న్యూస్: కనీస జీతం రూ. 9,880 ఇవ్వాల్సిందే

  • Published By: vamsi ,Published On : March 24, 2019 / 03:07 AM IST
ఉద్యోగులకు గుడ్ న్యూస్: కనీస జీతం రూ. 9,880 ఇవ్వాల్సిందే

Updated On : March 24, 2019 / 3:07 AM IST

దేశంలో ఉద్యోగుల కనీస వేతన ఖరారుపై కేంద్ర కార్మికశాఖ ఏర్పాటు చేసిన జాతీయ కనీస వేతన నిపుణుల కమిటీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల కనీస వేతనంపై నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఉద్యోగి నెలవారీ (26 పనిదినాలకు) కనీస వేతనం రూ. 9,880గా కమిటీ నిర్ణయించింది. జాతీయ స్థాయిలో ఐదు రీజియన్‌లను గుర్తించగా తెలుగు రాష్ట్రాలను రెండో రీజియన్‌లో కమిటీ పెట్టింది.

జులై 2018 నాటి స్థానిక పరిస్థితులు, ధరల సూచీలు, జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకున్న నిపుణుల కమిటీ కనీస వేతనం ఎంత ఉండాలి అని నిర్ణయించింది. 2012 కంటే ముందు జాతీయ స్థాయిలో ఉద్యోగి కనీస వేతనం రూ. 4,570గా ఉండగా.. మారిన పరిస్థితుల రిత్యా ఏడేళ్లలో వ్యయంలో భారీ మార్పులు వచ్చినట్లు కమిటీ గుర్తించింది. ఈ మేరకు పూర్తిస్థాయి నివేదికను ఇటీవల కేంద్ర కార్మిక శాఖకు అందజేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం కనీస వేతన విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఈ ఉత్తర్వులు వెలువడిన తర్వాత కనీస వేతనం కంటే తక్కువ ఇవ్వాడానికి ఏ కంపెనీకి కుదరదు. ఎక్కువ ఇస్తే మాత్రం అది ఆ కంపెనీ యాజమాన్యం నిర్ణయం బట్టి ఉంటుంది.