నీలోఫర్ ఘటనపై నిపుణుల కమిటీ ఏర్పాటు….డీఎంఈ. రమేశ్ రెడ్డి

హైదరబాద్ నీలోఫర్ ఆస్పత్రిని వివాదాలు చుట్టుముట్టాయి. ఆస్పత్రిలో చిన్నపిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. క్లినికల్ ట్రయల్స్ అంశాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ ను డీ.ఎం.ఈ. (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) రమేశ్ రెడ్డి వివరణ కోరారు.
క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి రోగి, బంధువుల అనుమతి తప్పని సరిగా తీసుకుంటామని, క్లినికల్ ట్రయల్స్ చేసేటప్పుడు రోగికి అందిస్తున్నవైద్యంపై వీడియో రికార్డింగ్ చేస్తారని డీఎంఈ చెప్పారు. నీలోఫర్ లో క్లినికల్ ట్రయల్స్ ఘటనపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, సోమవారం, సెప్టెంబరు30న, నిపుణుల కమిటీ ఆస్పత్రిని సందర్శించి ఆస్పత్రిలో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ పై నివేదిక ఇస్తుందని తెలిపారు.
నిబంధనలకు లోబడే క్లినికల్ ట్రయల్స్ చేస్తారని, వాటి గురించి రోగికి, రోగి బంధువులకు పూర్తిగా వివరిస్తారని ఆయన తెలిపారు. బలవంతంగా ఎవరిమీదా క్లినకల్ ట్రయల్స్ ప్రయోగించరని రమేశ్ రెడ్డి తెలిపారు. నీలోఫర్ ఆస్పత్రికి సరఫరా చేస్తున్నమందులు అన్నీ ప్రభుత్వ అనుమతి పొందిన మందులేనని, వాటిపై ఎటువంటి అపోహలు వద్దని ఆయన చిన్నారుల తల్లితండ్రులను కోరారు.