నుమాయిష్ ఫైర్ : వీకెండ్ అయితే ఎంత ఘోరం జరిగేది?

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 09:22 PM IST
నుమాయిష్ ఫైర్ : వీకెండ్ అయితే ఎంత ఘోరం జరిగేది?

Updated On : January 30, 2019 / 9:22 PM IST

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌ : నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో.. నుమాయిష్‌కు భారీగా తరలివచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు. ఎగ్జిబిషన్‌లోని స్టాళ్లలో ఎక్కువగా ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించే దుకాణాలు ఉండటంతో క్షణాల్లో మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకునే లోపే దుకాణాలు కాలి బూడిదయ్యాయి.

నుమాయిష్‌ జరుగుతుండటంతో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. 2019, జనవరి 30వ తేదీ రాత్రి 8.30గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆంధ్రాబ్యాంకు స్టాల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్టు అధికారులు గుర్తించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో 200కుపైగా స్టాల్స్‌ కాలి బూడదయ్యాయి. దట్టమైన పొగలతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పక్క స్టాల్స్‌కు మంటలు వేగంగా విస్తరించాయి. నుమాయిష్ చరిత్రలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం. ప్రమాదం జరిగిన వెంటనే.. సందర్శకులు పరుగులు తీశారు. ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పొగ కారణంగా ఊపిరాడక 10మందికి అస్వస్థతకు గురయ్యారు. వారిని నిమ్స్‌తో పాటు నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

నుమాయిష్‌కు 30వేల మంది సందర్శకులు వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. వీరంతా ఒక్కసారిగా ఎగ్జిబిషన్‌ మైదానం నుంచి బయటకు రావడంతో నాంపల్లి గాంధీభవన్‌ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. టిక్కెట్టు లేకపోయినా సందర్శకులకు మెట్రోలో ప్రయాణించేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.   

వీకెండ్ కాకపోవడంతో జనం పెద్ద సంఖ్యలో రాలేదు. ప్రాణ నష్టం జరుగలేదు. అదే వీకెండ్ అయితే నుమాయిష్ చూసేందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు కనీసం లక్ష మంది జనం వచ్చేవారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ. బయటకు వెళ్లే పరిస్థితి ఉండేదికాదు. ఇది ఊహించుకుంటేనే వణుకు వస్తోంది. గ్రౌండ్ కెపాసిటీ లక్షపైనే ఉంటుందని అంచనా. వీక్ మిడిల్ డేస్ కావటంతో.. 30వేల మంది వరకు మాత్రమే వచ్చారు. అదే వీకెండ్ శుక్ర, శని, ఆదివారాల్లో అయితే రద్దీ విపరీతంగా ఉంటుంది. కనీసం ఒక లక్ష మంది వరకు ఉండేవారు. ఆ టైంలో అగ్నిప్రమాదం జరిగి ఉంటే.. పరిస్థితి ఏంటనే ఆలోచన వస్తేనే చెమటలు పడుతున్నాయి. ఇదంతా అదృష్టం అంటున్నారు.

 

వీకెండ్ అయితే ఎంత ఘోరం జరిగేది అని చర్చించుకోవటం కనిపించింది. ఇప్పుడు ఆస్తి నష్టం మాత్రమే ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు అధికారులు. వీకెండ్ కాకపోవటంతో పెను ముప్పు తప్పినట్లైంది. ప్రాణ నష్టం జరుగకపోవడంతో అధికార యంత్రాంగానికి బిగ్ రిలీఫ్ కదా…