షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..ఎనిమిది నెలల చిన్నారి మృతి

హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ నగర్ షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సోమవారం (21.10.2019) అగ్నిప్రమాదం సంభవించింది. ఐసీయులో షాట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఊపిరి ఆడక ఓ చిన్నారి మృతి చెందగా.. ఏడుగురు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 42మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం పలు ఆస్పత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ చిన్నారులకు తల్లిదండ్రులు..బంధువులు హాస్పిటల్ ముందు నిరసన తెలిపారు.