ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపాం.. చంపే ఉద్దేశం లేదు: పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. అయితే ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు వెల్లడించారు పోలీసులు. వారిని చంపే ఉద్దేశం లేదని చెప్పారు పోలీసులు.
దిశ హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. తమ వద్ద ఆయుధాలు తీసుకొని నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారని, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపడంతో వాళ్లు చనిపోయినట్లు పోలీసులు చెప్పారు.
కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కున్న ఏ2 శివ. పోలీసు అధికారిపై కాల్పులకు ప్రయత్నించాడు నిందితుడు శివ. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో పోలీసులపై రాళ్లతో దాడికి దిగడంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చెసినట్లు చెబుతున్నారు.
దిశ హత్యాచారం నిందితుల మృతదేహాలకు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి వంతెన ప్రాంతానికే పోలీసులు వైద్యులను పిలిపించారు. స్థానిక ఆర్డీవో సమక్షంలో శవపంచనామా నిర్వహించనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.