గృహప్రవేశ వేడుకల్లో అపశృతి : హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ పేలి పలువురికి గాయాలు

హైదరాబాద్ లో గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హయత్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు గాయపడ్డారు.

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 07:14 AM IST
గృహప్రవేశ వేడుకల్లో అపశృతి : హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ పేలి పలువురికి గాయాలు

Updated On : January 31, 2020 / 7:14 AM IST

హైదరాబాద్ లో గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హయత్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు గాయపడ్డారు.

హైదరాబాద్ లో గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హయత్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు గాయపడ్డారు. గృహ ప్రవేశ వేడుకల్లో గ్యాస్ స్టవ్ వెలిగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులతోపాటు బంధువులకు కూడా గాయాలు అయ్యాయి.

గ్యాస్ స్టవ్ ను వెలిగించే క్రమంలో గ్యాస్ సిలిండ్ పేలి దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. 

గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడంతో మంటలు వ్యాపించాయి. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఘటనాస్థలికి చేరుకున్నారు. చికిత్స కోసం బాధితులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.