CAA, NRC, NPRలను వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ తీర్మానం

దేశవ్యాప్తంగా CAA, NRC, NPRలకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సీఏఏ, ఎన్ ఆర్ సీ, ఎన్ పీఆర్ లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. 

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 12:40 PM IST
CAA, NRC, NPRలను వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ తీర్మానం

Updated On : February 8, 2020 / 12:40 PM IST

దేశవ్యాప్తంగా CAA, NRC, NPRలకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సీఏఏ, ఎన్ ఆర్ సీ, ఎన్ పీఆర్ లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. 

దేశవ్యాప్తంగా CAA, NRC, NPRలకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ మూడింటిని విపక్షాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో మొట్టమొదటగా కేరళ రాష్ట్రం సీఏఏను వ్యతిరేకించింది. తర్వాత పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయి. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం సీఏఏను వ్యతిరేకించాయి. తమ రాష్ట్రాల్లో సీఏఏ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశాయి. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సీఏఏకు వ్యతిరేకమని ప్రకటించారు. తాజాగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సీఏఏ, ఎన్ ఆర్ సీ, ఎన్ పీఆర్ లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. 

మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన తీర్మానం
శనివారం (ఫిబ్రవరి 8, 2020) నిర్వహించిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో సీఏఏ, ఎన్ ఆర్ సీ, ఎన్ పీఆర్ పై చర్చ సాగింది. ఎన్ ఆర్ సీ, సీఏఏ, ఎన్ పీఆర్ లను వ్యతిరేకిస్తూ కౌన్సిల్ సమావేశం తీర్మానం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన కౌన్సిల్ తీర్మానం చేసింది. రోడ్ల విస్తరణ, నాలాలను వెడల్పు చేయడం, వారాంతపు సంతల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యం తదితర అంశాలపై కౌన్సిల్ చర్చించింది.

6 వేల 973 కోట్లతో బల్దియా బడ్జెట్‌ కు జీహెచ్‌ఎంసీ ఆమోదం
6 వేల 973 కోట్లతో బల్దియా బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ ఆమోదం తెలిపింది. ఇందులో రెవెన్యూ ఆదాయం 3 వేల 667 కోట్ల రూపాయలు కాగా.. మూలధన ఆదాయం 630 కోట్లు. రోడ్ల అభివృద్ధి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకు 1593 కోట్లు కేటాయించారు. మరోవైపు నిధుల కేటాయింపు అసమగ్రంగా ఉందని ఎంఐఎం ఆరోపించింది. నిధులు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.