చెన్నై షాపింగ్ మాల్‌కు రూ.4లక్షలు, GPR మల్టిప్లెక్స్ కు రూ.3లక్షలు, LG షో రూమ్‌కి రూ.2లక్షలు ఫైన్.. అక్రమ హోర్డింగ్స్ పై GHMC కొరడా

  • Published By: naveen ,Published On : September 16, 2020 / 04:34 PM IST
చెన్నై షాపింగ్ మాల్‌కు రూ.4లక్షలు, GPR మల్టిప్లెక్స్ కు రూ.3లక్షలు, LG షో రూమ్‌కి రూ.2లక్షలు ఫైన్.. అక్రమ హోర్డింగ్స్ పై GHMC కొరడా

Updated On : September 16, 2020 / 5:19 PM IST

హైదరాబాద్ నగరంలో అక్రమ హోర్డింగ్స్‌, బ్యానర్లు, ఫ్లెక్సీలపై ఇప్పటికే పలుసార్లు హెచ్చరించిన జీహెచ్ఎంసీ ఇప్పుడు కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపార, వాణిజ్య సంస్థలకు భారీగా జరిమానాలు విధించింది. అమీర్‌పేట్‌లోని చెన్నై షాపింగ్ మాల్‌కు రూ.4 లక్షలు జరిమానా విధించిన జీహెచ్‌ఎంసీ.. అమీర్‌పేట్‌లోని వీఆర్కే సిల్క్స్‌కు రూ.2లక్షల జరిమానా వేసింది. అలాగే ఎస్‌ఆర్‌ నగర్‌లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ కు రూ.లక్షా 50 వేలు, అక్కడే రిలయన్స్ డిజిటల్‌కు కూడా రూ. లక్ష జరిమానా విధించింది.

లక్డికాపూల్‌లోని ఇంపీరియల్ రెస్టారెంట్‌కు రూ. లక్ష జరిమానా విధించింది జీహెచ్‌ఎంసీ. నిజాంపేట ఎక్స్ రోడ్డులో ఉన్న జీపీఆర్ మల్టిప్లెక్స్ కు రూ.3లక్షల జరిమానా విధించింది. అక్రమంగా ఏర్పాటు చేసే హోర్డింగ్ లు, బ్యానర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అడ్వర్ టైజ్ మెంట్ పాలసీ నిబంధనలు ఉల్లింఘించినందుకు వీరిపై కొరడా ఝళిపించింది జీహెచ్ఎంసీ.


https://10tv.in/once-again-lrs-those-who-bought-plots-in-illegal-layouts/
భారీగా ఫైన్లు విధించడం ద్వారా అక్రమ హోర్డింగ్‌లపై మిగతా వారికి వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది. కాగా, గతంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులను కూడా జీహెచ్‌ఎంసీ తొలగించిన సంగతి తెలిసిందే. ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా, భారీగా ఫైన్లు విధించినా మార్పు రావడం లేదు. అక్రమ హోర్డింగ్స్ కారణంగా కొన్నిసార్లు తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. తీవ్రమైన గాలులు వీచినప్పుడు హోర్డింగ్స్ నేలకొరుగుతున్నాయి. జనాల మీద పడి ప్రాణాలు పోతున్నాయి.