ఆ ప్లాట్లు కొనొద్దు : నగరవాసులకు GHMC గమనిక

హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ ముఖ్య గమనిక జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్లాట్లను కొనొద్దని చెప్పింది. అవన్నీ అక్రమ నిర్మాణాలే అని తేల్చింది. శేరిలింగంపల్లి

  • Published By: veegamteam ,Published On : September 22, 2019 / 06:29 AM IST
ఆ ప్లాట్లు కొనొద్దు : నగరవాసులకు GHMC గమనిక

Updated On : September 22, 2019 / 6:29 AM IST

హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ ముఖ్య గమనిక జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్లాట్లను కొనొద్దని చెప్పింది. అవన్నీ అక్రమ నిర్మాణాలే అని తేల్చింది. శేరిలింగంపల్లి

హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ ముఖ్య గమనిక జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్లాట్లను కొనొద్దని చెప్పింది. అవన్నీ అక్రమ నిర్మాణాలే అని తేల్చింది. శేరిలింగంపల్లి జోన్ చందానగర్ పరిధిలోని హఫీజ్‌పేట్ సర్వే నెంబర్-78లో గోకుల్ ప్లాట్లు కొనొద్దని జీహెచ్ఎంసీ చెప్పింది. ఆ ప్లాట్లు అక్రమంగా నిర్మించారంది. అక్రమంగా నిర్మిస్తున్న 91 నిర్మాణాలను కొనుగోలు చేయరాదని జీహెచ్‌ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే ఖానామెట్ అయ్యప్ప సొసైటీలోని 17 ప్లాట్లలో అక్రమంగా అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారని వాటిని కూడా కొనుగోలు చేయరాదని అధికారులు కోరారు. కొనుగోలుదారులు టైటిల్‌కు సంబంధించిన అన్ని పత్రాలు, అనుమతులు చూసుకున్న తర్వాతే ముందుకుసాగాలని అధికారులు సూచించారు. లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

నగరంలో పలు ప్రాంతాల్లో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అయితే కొందరు బిల్డర్లు డబ్బు ఆశతో ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే ప్లాట్లు, అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నారు. ప్రమాదకర స్థలాల్లో నిర్మాణాలు చేస్తున్నారు. ఈ విషయాలు తెలియని ప్రజల వాటిని కొనుగోలు చేసి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. నష్టం జరక్కముందే జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటి సమాచారం ప్రజలకు తెలుపుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.