హయత్‌నగర్‌లో అదృశ్యమైన బాలిక సేఫ్
హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. 24గంటల్లోనే బాలిక ఆచూకీ కనిపెట్టారు.

హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. 24గంటల్లోనే బాలిక ఆచూకీ కనిపెట్టారు.
హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పెద్ద అంబర్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక నిన్న అదృశ్యమవగా..ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. 24గంటల్లోనే బాలిక ఆచూకీ కనిపెట్టారు. ఆమె మహబూబ్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..క్షేమంగా ఇంటికి చేర్చారు.
బుధవారం (నవంబర్ 6, 2019) హయత్‌నగర్‌లో బాలికను దుండగులు కిడ్నాప్ చేశారు. 14 సంవత్సరాల వయస్సు గల అంజలి.. పెద్ద అంబర్ పేటలోని జెడ్ పీహెచ్ ఎస్ లో 9 వ తరగతి చదువుతోంది. స్కూల్ కు వెళ్లిన అంజలి.. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి మహేష్ హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొంతమంది కిడ్నాపర్లు అమ్మాయిని నాగర్ కర్నూలు వైపు తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టగా బాలిక ఆచూకీ లభించింది. బాలిక మహబూబ్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించారు.