రెండు రోజులు హైదరాబాద్ కు గోదావరి నీళ్లు బంద్
ఔటర్ రింగ్ లోపలున్న గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టనున్న పైప్ లైన్ జంక్షన్ పనుల కారణంగా గురువారం హైదరాబాద్ లో పలు ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిచిపోనుంది.

ఔటర్ రింగ్ లోపలున్న గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టనున్న పైప్ లైన్ జంక్షన్ పనుల కారణంగా గురువారం హైదరాబాద్ లో పలు ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిచిపోనుంది.
ఔటర్ రింగ్ లోపలున్న గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టనున్న పైప్ లైన్ జంక్షన్ పనుల కారణంగా గురువారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిచిపోనుంది. గురువారం (సెప్టెంబర్ 5, 2019) ఉదయం 6 గంటలకు నుంచి శుక్రవారం (సెప్టెంబర్ 6, 2019) ఉదయం 6 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి తెలిపింది. పనులు పూర్తైన వెంటనే నీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపింది.
సరఫరా నిలిచిపోతున్న ప్రాంతాలు
నగరంలోని హస్మత్ పేట్, పేట్ బషీరాబాద్ బ్యాంక్ కాలనీ, మీనాక్షి, డిఫెన్స్ కాలనీ, గౌతమ్ నగర్, చాణక్యపురి, తిరుమల్ నగర్, గాయత్రి నగర్, అల్వాల్ మున్సిపల్ ఏరియా, లోతుకుంట, ఫాదర్ బాలయ్య నగర్, ఓయూటీ కాలనీ, రాధిక, చెర్లపల్లి, కీసర, రాంపల్లి, నాగారం, దమ్మాయిగూడ, హకీంపేట్, సింగాయిపల్లి, దేవరయాంజల్, తూంకుంట, పోతాయిపల్లి, చెర్లపల్లి, తుర్కపల్లి, అహ్మద్ గూడ, మెస్ త్రిశూల్, గన్ రాక్, కంటోన్మెట్ బోర్డు, రుద్రనగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది.