గుడ్ న్యూస్ : రూపాయికే నల్లా కనెక్షన్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నీటి కనెక్షన్‌ రేటును ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 05:11 PM IST
గుడ్ న్యూస్ : రూపాయికే నల్లా కనెక్షన్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నీటి కనెక్షన్‌ రేటును ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నీటి కనెక్షన్‌ రేటును ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇతరులకు 100 రూపాయలకే నల్లా కనెక్షన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

 

ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో ఇంటికి నల్లా కనెక్షన్ పొందేందుకు 6 వేల రూపాయల డిపాజిట్‌…ఇంటి లోపల నల్లా పెట్టుకోవడానికి ప్రస్తుతం 10 వేల 500 రూపాయల డిపాజిట్ తీసుకుంటున్నారు. అంత పెద్ద మొత్తంలో డిపాజిట్ రుసుము ఉండడం వల్ల పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని భావించిన కేసీఆర్…ఈ నిర్ణయం తీసుకోన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ద్వారా 7.9లక్షల మందికి తాగునీరు అందించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.