శభాష్ మహేష్ బాబు : జీఎస్టీ చెల్లించిన శ్రీమంతుడు

  • Published By: chvmurthy ,Published On : February 22, 2019 / 02:38 AM IST
శభాష్ మహేష్ బాబు : జీఎస్టీ చెల్లించిన శ్రీమంతుడు

Updated On : February 22, 2019 / 2:38 AM IST

హైదరాబాద్ : ఏఎంబీ సినిమాస్ మల్టి ప్లెక్స్ ధియేటర్లలో సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను సినీనటుడు, ధియేటర్ యజమాని మహేష్ బాబు ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి చెల్లించారు. మల్టీ ప్లెక్స్ సినిమా థియేటర్‌ కాంప్లెక్సు (ఏఎంబీ సినిమాస్‌) యజమానులైన మహేష్‌బాబు, సునీల్‌ నారంగ్‌లు తమది కాని లాభాన్ని గుర్తించి తిరిగి చెల్లించినందుకు  జీఎస్‌టీ హైదరాబాద్‌ కమిషనరేట్‌ వారిని అభినందిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల  చేసింది.

దేశవ్యాప్తంగా ఎవరూ ఇలా బాధ్యతగా జీఎస్టీని వెనక్కు తిరిగి ఇవ్వలేదని మహేష్‌బాబు, సునీల్‌లు అందరికీ ఆదర్శంగా నిలిచారని కమిషనరేట్‌ తెలిపింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరుల్లోని థియేటర్ల యజమానులపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని కమీషనరేట్ పేర్కొంది.