సమ్మె సమ్మే.. చర్చలు చర్చలే : ఆర్టీసీ జేఏసీ

  • Published By: veegamteam ,Published On : October 18, 2019 / 11:45 AM IST
సమ్మె సమ్మే.. చర్చలు చర్చలే : ఆర్టీసీ జేఏసీ

Updated On : October 18, 2019 / 11:45 AM IST

హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని కోరారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. మేం కూడా సిద్ధంగా ఉన్నామని.. చర్చలకు వెళ్లటానికి రెడీ అని ప్రకటించారాయన. కోర్టు వ్యాఖ్యలు మాత్రమే చేసింది.. తుది తీర్పు కాదని వెల్లడించారాయన. అన్ని డిమాండ్లపై చర్చలకు కూర్చుంటే.. సాధ్యాసాధ్యాలు ఏంటనేది తేలిపోతుందన్నారాయన.

కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధం అన్నట్లు సంకేతాలు వస్తున్నారు. సునీల్ శర్మ ఆధ్వర్యంలో చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 
చర్చలు ప్రారంభం అయినా ఆర్టీసీ సమ్మె యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు జేఏసీ లీడర్ అశ్వత్థామరెడ్డి. గతంలో ప్రకటించినట్లుగా అన్ని ఆందోళనలు, నిరసనలు అన్నీ కొనసాగుతాయని వెల్లడించాయాన. గతంలో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని.. ఇప్పుడైనా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారాయన. కార్మికులను భయాందోళనలకు గురి చేసే విధంగా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. యాజమాన్యం పరిధిలోని డిమాండ్ల పరిష్కారం విషయంలో అయినా స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. సమ్మె విరమించి చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. సమ్మె కొనసాగిస్తూనే చర్చలు జరుపుతామన్నారాయన.

అక్టోబర్ 19న ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్ కూడా యథావిథిగా కొనసాగుతుందని వెల్లడించారాయన. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం ఎందుకు సాధ్యం కాదో చెప్పాలన్నారు.