ఇక కట్టుడే : తెలంగాణ సచివాలయానికి లైన్ క్లియర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్. నూతన సచివాలయం నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. బైసన్ పోలో గ్రౌండ్స్‌లో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 01:18 PM IST
ఇక కట్టుడే : తెలంగాణ సచివాలయానికి లైన్ క్లియర్

Updated On : January 29, 2019 / 1:18 PM IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్. నూతన సచివాలయం నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. బైసన్ పోలో గ్రౌండ్స్‌లో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్. నూతన సచివాలయం నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. బైసన్ పోలో గ్రౌండ్స్‌లో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన సచివాలయం నిర్మాణం కోసం అవసరమైన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించుకోవచ్చుని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సెక్రటేరియట్‌కు స్థలం కేటాయింపుపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి కోర్టు అనుమతిచ్చింది.

 

బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సెక్రటేరియట్ కోసం బైసన్ పోలో స్థలం కేటాయించాలని గతంలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వినతిపత్రం సమర్పించింది. అయితే ఈ మైదానంపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున భూమి బదలాయింపు విషయంలో కేంద్రం ఇన్నాళ్లూ జాప్యం చేస్తూ వచ్చింది. తాజాగా బైసన్ పోలో గ్రౌండ్‌లో నిర్మాణానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్థలంపై ఉన్న కేసులను కొట్టివేసింది. దీంతో సాధ్యమైనంత త్వరలోనే బైసన్ పోలో గ్రౌండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇవ్వనుందని సమాచారం. ఆ వెంటనే కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. హైకోర్టు తీర్పు పట్ల ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది.