వెదర్ అలర్ట్ : ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

ఇప్పటికే దేశంలో భారీ వర్షాలు పడ్డాయి. కుండపోత వర్షాలతో పలు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నదులు, చెరువులు పొంగిపొర్లాయి. ప్రాజెక్టులు నిండుకుండలను

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 02:54 PM IST
వెదర్ అలర్ట్ : ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

Updated On : November 20, 2019 / 2:54 PM IST

ఇప్పటికే దేశంలో భారీ వర్షాలు పడ్డాయి. కుండపోత వర్షాలతో పలు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నదులు, చెరువులు పొంగిపొర్లాయి. ప్రాజెక్టులు నిండుకుండలను

ఇప్పటికే దేశంలో భారీ వర్షాలు పడ్డాయి. కుండపోత వర్షాలతో పలు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నదులు, చెరువులు పొంగిపొర్లాయి. ప్రాజెక్టులు నిండుకుండలను తలపించాయి. వానాకాలం ముగిసింది. చలికాలం ప్రారంభమైంది. అయినా వర్షాలు మాత్రం ఎక్కడో ఒక చోటు పడుతూనే ఉంది. 

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. 

ఏపీలోని కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. రాయలసీమలో మాత్రం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పడిన వర్షాల కారణంగా పంట నష్టంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.