హెల్మెట్ మస్ట్ : గణేష్ నిమజ్జనానికి వచ్చే వారికి పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందడి తార స్థాయికి చేరింది. మహా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో 40వేల

  • Published By: veegamteam ,Published On : September 12, 2019 / 02:50 AM IST
హెల్మెట్ మస్ట్ : గణేష్ నిమజ్జనానికి వచ్చే వారికి పోలీసుల హెచ్చరిక

Updated On : September 12, 2019 / 2:50 AM IST

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందడి తార స్థాయికి చేరింది. మహా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో 40వేల

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందడి తార స్థాయికి చేరింది. మహా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో 40వేల వరకు గణనాథుడి ప్రతిమలను గురువారం(సెప్టెంబర్ 12,2019) నిమజ్జనం చేయనున్నారు. ఉదయం నుంచి శుక్రవారం(సెప్టెంబర్ 13,2019) మధ్యాహ్నం వరకు నిమజ్జనం ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. నిమజ్జనం దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉదయం 6 గంటల నుంచే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వ్యక్తిగత వాహనాలు తీసుకొస్తే ఇబ్బందులు పడే అవకాశముందన్నారు. ఎల్బీనగర్, ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

నిమజ్జనంలో పాల్గొనే వాహనదారులకు ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ హెచ్చరికలు చేశారు. నిమజ్జనానికి వచ్చే వాహనదారులకు హెల్మెట్ మస్ట్ అని చెప్పారు. అలాగే వాహనదారులకు పలు జాగ్రత్తలు చెప్పారు. వాహనాలపై పరిమితికి మించి ప్రయాణం చేయొద్దన్నారు. 2018లో హెల్మెట్ లేకుండా ప్రయాణించి ఐదుగురు చనిపోయారని గుర్తు చేశారు. యాత్రలో బైక్ లు, కార్లకు అనుమతి లేదన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా వాహనదారులు ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. అతివేగంగా వాహనాలు నడపటం వంటి పనులు చేయొద్దని సూచించారు.

* శోభాయాత్రలో విగ్రహాల వాహనాలకు మాత్రమే అనుమతి
* అంబులెన్స్ లకు మినహాయింపు ఇచ్చిన పోలీసులు
* తెలుగు తల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై బైక్ లకు మాత్రమే అనుమతి
* విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవారు ఎల్బీనగర్ కు చేరుకుని.. అక్కడి నుంచి మెట్రో రైలులో గమ్యస్థానాలకు చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు.
* కర్నూలు, కడప, బెంగళూరు నుంచి నగరంలోకి ప్రవేశించాలంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వరకు చేరుకోవచ్చన్నారు.
* బీదర్, మెదక్, సంగారెడ్డి నుంచి నగరానికి వచ్చే వారు ఊరేగింపు మార్గాలు మినహాయించి కూకట్ పల్లి నుంచి ఖైరతాబాద్ వరకు చేరుకోవచ్చన్నారు.

దూర ప్రాంతాల నుంచి గణేశ్ నిమజ్జనం చూసేందుకు వచ్చేవారు ఉప్పల్, కూకట్ పల్లి నుంచి మెట్రోలో ఖైరతాబాద్ వరకు చేరుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి ఖైరతాబాద్ వరకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్ లకు ట్రాఫిక్ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు. అత్యవసర పరిస్థితులు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు వీలుగా పోలీసులు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. 24 గంటలు ఈ ఫోన్లు పనిచేస్తాయన్నారు.

040-27852482
94905 98985
90102 03626
84906 16555(వాట్సాప్ మాత్రమే)