హై అలర్ట్ : ఏ క్షణమైనా హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తివేత
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. నీటితో కళకళలాడుతోంది. కొన్ని రోజుల నుంచి నగర పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చి

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. నీటితో కళకళలాడుతోంది. కొన్ని రోజుల నుంచి నగర పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చి
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. నీటితో కళకళలాడుతోంది. కొన్ని రోజుల నుంచి నగర పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చి చేరుతున్న వరదతో హుస్సేన్ సాగర్ జలాశయాన్ని తలపిస్తోంది. సోమవారం(సెప్టెంబర్ 2,2019) సాగర్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయికి దగ్గర కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నీటిని తరలించాలని నిర్ణయించారు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తి వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పరీవాహక ప్రజలకు ఈ విషయం తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉంటూ నీటి పరిమాణాన్ని గమనిస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా.. 11 రోజులకు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఏటా పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. ఈసారి ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్‌లో వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో.. నిమజ్జనానికి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హుస్సేన్ సాగర్‌కు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌కి వచ్చిన వాళ్లు కనీసం ఒక్కసారన్నా.. నెక్లెస్ రోడ్డులోని హుస్సేన్ సాగర్‌ను చూడాలనుకుంటారు. హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడు మరో ప్రత్యేక ఆకర్షణ. హుస్సేన్ సాగర్‌లో బోటింగ్ చేసి బుద్ధుడి విగ్రహం దగ్గరకి వెళ్లి సెల్ఫీ తీసుకుని టూరిస్టులు ఎంజాయ్ చేస్తారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనం సోమవారం నుంచి ప్రారంభం కానుండటంతో హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 11 వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి వరకు ఇవి అమల్లో ఉంటాయి.
* కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ మీదికి అనుమతించరు. వీటిని కవాడిగూడ చౌరస్తా వైపు పంపిస్తారు. లిబర్టీ వైపు వెళ్ళాల్సిన వారు కవాడిగూడ చౌరస్తా, గాంధీనగర్ టి జంక్షన్, డీబీఆర్ మిల్స్, ఇందిరాపార్క్, దోమలగూడ మీదుగా వెళ్ళాలి. ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్ళాల్సిన వారు రాణిగంజ్, నల్లగుట్ట, సంజీవయ్యపార్క్, నెక్లెస్‌రోడ్, ఖైరతాబాద్ ఫ్లైవర్ మార్గాన్ని అనుసరించాలి.
* ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్‌లోకి అనుమతించరు. వీటిని నెక్లెస్ రోడ్ లేదా మింట్ కాంపౌండ్ వైపు పంపిస్తారు.
* తెలుగుతల్లి విగ్రహం జంక్షన్ నుంచి సాధారణ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్‌లోకి అనుమతించరు. వీటిని ఇక్బాల్ మీనార్ వైపు పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ దేవాలయం, డీబీఆర్ మిల్స్, చిల్డ్రన్స్ పార్క్, సెయిలింగ్ క్లబ్, కర్బాలా మైదాన్ మీదుగా మళ్లిస్తారు.
* గోశాల వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే వాహనాలను డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా పంపిస్తారు.