బ్రేకింగ్ : దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి హైకోర్టు అనుమతి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 10:26 AM IST
బ్రేకింగ్ : దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి హైకోర్టు అనుమతి

Updated On : December 4, 2019 / 10:26 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన కాసేపటికే.. హైకోర్టు నుంచి రిప్లయ్ ఇచ్చింది. ప్రభుత్వ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కోర్టు.. ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వెంటనే మహబూబ్ నగర్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కోర్టు సెషన్స్ జడ్జి నేతృత్వంలో ఫాస్ట్ టాక్ కోర్టు ఏర్పాటైంది. దీంతో దిశ కేసు విచారణ వేగవంతం కానుంది. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తారు.

దిశ హత్యాచారం కేసులో నిందితులను వెంటనే ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో వీలైనంత త్వరగా విచారణ జరిపేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటుకి పర్మిషన్ కోరుతూ హైకోర్టుకి లేఖ రాసింది.

ప్రస్తుతం దిశ హత్యాచారం కేసు నిందితులు నలుగురు చర్లపల్లి జైల్లో ప్రత్యేక నిఘాలో ఉన్నారు. కొందరు సిబ్బందిని వీరికి కాపలాగా ఉంచారు. శంషాబాద్ దగ్గర వెటర్నరీ డాక్టర్ దిశ.. నలుగురు కామాంధుల చేతుల్లో దారుణంగా అత్యాచారం, హత్యకు గురి కావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి.. తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందో రాదో అని కంగారు పడుతున్నారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలంటే రేపిస్టులకు వెంటనే శిక్షలు విధించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేపిస్టులను తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆడపిల్లపై చేయి వేయాలంటే భయపడే విధంగా శిక్షలు ఉండాలని కోరుతున్నారు.