రాయదుర్గం వరకు మెట్రో రైలు :  నవంబర్ 29న ప్రారంభం 

  • Published By: chvmurthy ,Published On : November 25, 2019 / 01:09 AM IST
రాయదుర్గం వరకు మెట్రో రైలు :  నవంబర్ 29న ప్రారంభం 

Updated On : November 25, 2019 / 1:09 AM IST

హైదరాబాద్‌ మెట్రో రైలు మార్గాన్ని త్వరలో రాయదుర్గం వరకు పొడిగించనున్నారు.  నవంబర్ 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్‌ దీనిని ప్రారంభించనున్నారు. కారిడార్‌–3లో భా గంగా నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు ఇక మెట్రో ప్రయాణం సాగనుంది.

ప్రస్తుతం ఈ మార్గంలో హైటెక్‌ సిటీ వరకే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం వరకు 1.5 కి.మీ మేర అన్ని పనుల పూర్తితో పాటు రైల్వే సేఫ్టీ అనుమతులు రావడంతో 29న రైలు చివరి పాయింట్‌ వరకు చేరుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

ఆదివారం నవంబర్24న ఆయన ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 26, 27 తేదీల్లో మెట్రోరైల్‌ సేఫ్టీ అధికారి జనక్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మరోసారి రైళ్లను పరిశీలించి 29న ప్రారంభిస్తామని ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు.