Hyd Metro: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. సోమవారం నుంచి రాత్రి 11 వరకు మెట్రో
హైదరాబాద్ మెట్రో సేవల సమయాన్ని అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు ఉన్న సమయాన్ని రాత్రి 11:00 గంటల వరకు చేశారు. అంటే సంబంధిత టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. అయితే ఈ సౌకర్యం ఈ నెల 10 నుంచి అందుబాటులోకి రానున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం తెలిపారు

Hyderabad Metro
Hyd Metro: నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమయాన్ని రాత్రి 11:00 గంటల వరకు పెంచారు. అంటే సంబంధిత టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. అయితే ఈ సౌకర్యం ఈ నెల 10 నుంచి అందుబాటులోకి రానున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. అయితే ఉదయం సమయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటి వరకు ఉన్నట్లుగానే ఇకపై కూడా ఉదయం 6 గంటలకు సంబంధిత టెర్మినల్ నుంచి మొదటి మెట్రో రైలు బయలుదేరుతుంది.
హైదరాబాద్ మెట్రోలో మూడు ప్రధానమైన లైన్లు ఉన్నాయి. ఒకటి నాగోల్ నుంచి రాయ్‌దుర్గ్ వరకు (బ్లూ లైన్) మరొకటి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు (రెడ్ లైన్) ఒక చివరిది జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు (గ్రీన్ లైన్) మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. 66.5 కిలోమీటర్ల పొడవున, మూడు లైన్లలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి. ప్రతిరోజు 4 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే తాజాగా సమయం పెంచడంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా రెడ్, బ్లూ లైన్లలో ప్రతి రెండు నిమిషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంది.
Xiaomi: ఇండియా నుంచి పాకిస్తాన్‌కు మారనున్నట్లు ప్రచారంపై షియోమి ఏమందంటే?