గుడ్ న్యూస్ : పాతబస్తీకి మెట్రో రైల్.. స్టేషన్లు ఇవే 

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 05:30 AM IST
గుడ్ న్యూస్ : పాతబస్తీకి మెట్రో రైల్.. స్టేషన్లు ఇవే 

Updated On : September 21, 2019 / 5:30 AM IST

హైదరాబాద్ మెట్రో మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే ఓల్డ్ సిటీకి సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించింది. కారిడార్-2లో MGBS వరకు ఉన్న మెట్రో మార్గాన్ని.. ఓల్డ్ సిటీ వరకు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాతబస్తీలో ముందుగా ప్రతిపాదించిన మెట్రో అలైన్‌మెంట్‌ ప్రకారం నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో భూ సేకరణ సున్నితమైన సమస్యగా ఉంది. ఈ క్రమంలోనే పలు మార్పులతో స్టేషన్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ మార్గంలో చిన్నా పెద్ద కలిపి వందల సంఖ్యలో  ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. భూసేకరణ క్షేత్ర స్థాయిలో సాధ్యం కాకపోవడంతో ప్రస్తుతం మెట్రో పనులు పాతబస్తీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. దీంతో పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణం జరగాలంటే సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంది.ఈ చారిత్రక, మతపరమైన కట్టడాలకు నష్టం వాటిల్లకుండా ఐదు స్టేషన్లతో కూడిన  5.5 కిలోమీటర్ల మెట్రో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 

ఇప్పటికే 5.5 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న 5 స్టేషన్ల పేర్లను ఖరారు చేశారు అధికారులు. సాలర్జంగ్ మ్యూజియం స్టేషన్, చార్మినార్ స్టేషన్, శాలిబండ, శంషేర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లుగా నిర్మించనున్నారు. మెట్రో అలైన్‌మెంట్ ప్రకారం సాలర్జంగ్ మ్యూజియం, చార్మినార్ కట్టడాలు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వీటికున్న ప్రత్యేకత, చారిత్రకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ పేర్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.