బౌన్సర్లకు యమ గిరాకీ : వాలంటైన్స్ అలర్ట్

  • Published By: madhu ,Published On : February 14, 2019 / 03:19 AM IST
బౌన్సర్లకు యమ గిరాకీ : వాలంటైన్స్ అలర్ట్

హైదరాబాద్ : ఫిబ్రవరి 14..రానే వచ్చింది. ప్రేమికులు సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. వీరిని అడ్డుకోవడానికి వేరే వారు కూడా సిద్ధమౌతున్నారు. ఎక్కడైనా ప్రేమికులు కనిపిస్తే వారికి పెళ్లి చేసేస్తామని..లవర్స్‌ని అడ్డుకుంటామని పలువురు హెచ్చరిస్తున్నారు. దీనితో నగర పోలీసులు అలర్ట్ అయిపోయారు. ఫిబ్రవరి 14 గురువారం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ప్రేమికులకు అడ్డాగా ఉన్న పార్కులు, యూనివర్సిటీలు, పబ్స్, హోటల్స్, నెక్లెస్ రోడ్డ్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో గస్తీ పెంచారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని..తీసుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కాప్స్ హెచ్చరిస్తున్నారు. కొన్ని కీలక ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు కింది వారికి ఆదేశాలు జారీ చేశారు. 

ఇదిలా ఉంటే బౌన్సర్లకు ఈ రోజు కలిసి వచ్చింది. వీరి డిమాండ్ పెరిగిపోయింది. పబ్‌లు..బార్లలో గొడవలు జరుగకుండా వీరిని నిర్వాహకులు నియమించుకుంటున్నారు. రోజు వారి వేతనంపై ఇప్పటికే నియమించుకున్నాయి. కండలు తిరిగిన శరీరంతో కఠువుగా కనిపించే వీరిని చూస్తే ఎవరికైనా కొంచెం దడే. ఎవరికి వారు రక్షణ నియమించుకోవాలని పోలీసులు సూచించడంతో యాజమాన్యాలు వారిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. గురువారం ఒక్క రోజుకు రూ. 2వేలకు పైగానే వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అందులో కొంత మొత్తం బౌన్సర్..అతడిని ఏర్పాటు చేసిన సంస్థకు మరికొంత మొత్తం అందనున్నాయి.