నంబర్ ప్లేటు మారితే బుక్కైపోతారు
హైదరాబాద్ నగర రోడ్లపై వాహనాల నంబర్ ప్లేట్‌లు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండట్లేదు. నంబర్ ప్లేట్లపై డిజైన్లు, పదాలు, అక్షరాలు ఇష్టం వచ్చినట్లు ఉంటాయి.

హైదరాబాద్ నగర రోడ్లపై వాహనాల నంబర్ ప్లేట్‌లు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండట్లేదు. నంబర్ ప్లేట్లపై డిజైన్లు, పదాలు, అక్షరాలు ఇష్టం వచ్చినట్లు ఉంటాయి.
హైదరాబాద్ నగర రోడ్లపై వాహనాల నంబర్ ప్లేట్‌లు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండట్లేదు. నంబర్ ప్లేట్లపై డిజైన్లు, పదాలు, అక్షరాలు ఇష్టం వచ్చినట్లు ఉంటాయి. అంకెలు కూడా చెప్పలేనన్ని వంకర్లతో గుర్తించలేని విధంగా ఉంటున్నాయి. బైక్‌లు కార్ల నంబర్ ప్లేట్‌లపై ఇష్టం వచ్చినట్లు స్టిక్కర్లు అతికించేస్తున్నారు. అయితే ఇకపై ప్లేటు మారిందో పాట్లు పడక తప్పదు. దీనిపై నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ దృష్టిపెట్టారు. నంబర్ ప్లేట్‌లో ఉండే అక్షరాలు, అంకెల ఆకారం, పరిమాణం కచ్చితంగా మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్)లో నిర్దేశించిన ప్రకారమే ఉండాలని, నికి చెక్ పెట్టేందుకు ‘స్పెషల్ డ్రైవ్’ చేపట్టాలని నగర ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Also : సిటిజన్‌ల డిమాండ్: ఫ్లై ఓవర్ తెరవండి.. ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి
ఈ క్రమంలో నేరాలు చేసేవాళ్లు ఎక్కువగా తప్పుడు నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నంబర్ ప్లేట్‌పై ‘పోలీసు, ప్రభుత్వ వాహనం, కార్పొరేటర్, ప్రెస్, ఆర్మీ, ఎమ్మెల్యే, ఎంపీ’ ఇలా ఎలాంటి అక్షరాలు, అంశాలు రాయకూడదని అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. ఇలాంటి ఉల్లంఘన గమనించిన ప్రజలు.. వాటిని ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసు ఫేస్‌బుక్, ట్విటర్‌లతో పాటు హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626కు పంపాలని చెబుతున్నారు.
నంబర్ ప్లేట్ నిబంధనలు:
– ద్విచక్ర వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలలో మాత్రమే నంబర్ ఉండాలి.
-కమర్షియల్, గూడ్స్ వాహనాలకు పసుపు రంగు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి.
-నంబర్ ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, మెసేజ్‌లు రాయకూడదు.
-ఎవరైనా బోగస్ నంబర్ ప్లేటు వినియోగిస్తే క్రిమినల్ కేసు పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు.
-ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ 200 ఇంటూ 100 మిల్లీ మీటర్లు, కార్లకు 340 ఇంటూ 200 మిమీ లేదా 500 ఇంటూ 120 మిల్లీ మీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలకు 340 ఇంటూ 200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి.
గత మూడేళ్ల కాలంలో నమోదైన నంబర్ ప్లేట్ కేసులు:
2017 : 36,632
2018 : 71,324
2019 : 17,486(March)
Read Also : బ్లేడుతో పనిలేదు: రాజకీయాలకు బండ్ల గణేష్ గుడ్‌బై