కరోనా ఐడియాలు : ఫేస్ మాస్కులతో సూటు

కరోనా ఐడియాలు : ఫేస్ మాస్కులతో సూటు

Updated On : December 18, 2020 / 11:45 AM IST

Hyderabad textile merchant face masks suite: ఈ కరోనా కాలంలో ఎవ్వరూ ఎప్పుడూ ఊహించని కష్టాలే కాదు..జనాలకు కొత్త కొత్త ఐడియాలు వచ్చేస్తున్నాయి. వెరైటీ వెరైటీ మాస్కులు తయారుచేస్తూ జనాలను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఎవరి రేంజ్ లోవాళ్లు ఏకంగా బంగారం, వజ్రాలతో మాస్కులు తయారు చేయించుకున్నవారి గురించి కూడా తెలిసిందే. కానీ ఏకంగా ఫేస్ మాస్కులతో సూటే కుట్టేశారు మన హైదరాబాద్ క్రియేటర్స్.

హైదరాబాద్‌లోని ఓ బట్టల దుకాణం ఫేస్‌ మాస్కు ధరించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న ఆలోచనతోద ఏకంగా ఫేస్ మాస్కులతో ఓ సూట్ కుట్టేశారు. ఆ సూటును ఓ బొమ్మకు తొడి షాపు ముందు డిప్లేలో ఉంచారు.దీంతో ఆవైపుగా వెళ్లేవారంతా ఆ మాస్కుల సూట్ ను ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ మాస్కుల సూటుని పది రూపాయల ఫేస్‌ మాస్క్‌లతో తయారు చేయించారు. ప్రజల్లో ఫేస్ కు మాస్కు పెట్టుకోవటం ఎంత అవసరమో తెలియజేసేందుకు ఇలా ఏర్పాటు చేశామని బట్టల షాపు యాజమాన్యం తెలిపింది.

బట్టల వ్యాపారం కావడంతో దానికి తగ్గట్టే కస్టమర్లలో అవగాహన కల్పించాలని అనుకున్నామని..బొమ్మకు ఫేస్‌మాస్క్ సూట్ డిజైన్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చినట్టు చెప్పుకొచ్చారు. మాస్కులతో సూటులో భాగంగా ప్యాంటును సైతం మాస్కులతోనే కుట్టడం విశేషం.

ప్రపంచంలో కరోనా మహమ్మారి కష్టాలు మొదలై ఏడాది దాటింది. అయినా ఈనాటికి ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించలేకపోతున్నాం. భారత్‌లో లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కరోనా మహమ్మారినుంచి ప్రధాన రక్షణ ఫేస్‌మాస్కులే.ఫేసుకు మాస్కులు లేకుండా బైటకు రావద్దని ప్రభుత్వాలు ఎంతో అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏకంగా ఫేస్ మాస్కుతో కుట్టిన సూటు స్థానికులను ఆకట్టుకుంటోంది.