మత్తు వదలరా : Drunk And Drive..చుక్కలు చూపించారు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు మార్చి 15వ తేదీ రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పీకలదాకా మద్యం సేవించిన మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. మత్తులో మగువలు సైతం ట్రాఫిక్ పోలీసులను ఇబ్బందిపెట్టారు. వీకెండ్‌లో ఆల్కాహాల్ సేవించి అమ్మాయిలు తాగి ఊగారు. మద్యం మత్తులో పోలీసులను, మీడియా ప్రతినిధులను దుర్భాషలాడారు. కొంతమంది యువకులైతే పోలీసుల కంటపడకుండా తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. మొత్తానికి పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పలు బైక్‌లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు.