తహసీల్దార్ విజయా రెడ్డి ఘటనలో మరొకరు మృతి

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్‌మెట్‌లో పట్టపగలే తహసీల్దార్ విజయారెడ్డిని పెట్రోల్ పోసి హత్య చేశాడు సురేష్ అనే రైతు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన ఈ కేసులో నిందితుడు సురేష్ కూడా చనిపోయాడు. ఎమ్మార్వో విజయారెడ్డిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన రైతు సురేష్, తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా.. 07 నవంబర్ 2019 ఉదయం చనిపోయాడు.
వివాదాస్పద భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే కోపంతో ఎమ్మార్వోను సజీవ దహనం చేయగా.. ఆమెను కాపాండేందుకు ప్రయత్నించిన అటెండర్ చంద్రయ్య, డ్రైవర్ గురునాథానికి కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయితే డ్రైవర్ అప్పుడే చనిపోగా.. కంచన్‌బాగ్ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అటెండర్ చంద్రయ్య.
చికిత్స పొందుతూనే ఇవాళ(02 డిసెంబర్ 2019) తెల్లవారు జామున గుండెపోటు రావడంతో మృతి చెందాడు చంద్రయ్య. ఈ విషయాన్ని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో ఈ ఘటనలో చనిపోయినవారి సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఈ ఘటనలో నారాయణ అనే వ్యక్తి కూడా గాయపడగా.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు.