కూకట్ పల్లి ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు
హైదరాబాద్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

హైదరాబాద్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. కుమారుడు సందీప్ రావుకు చెందిన ప్రణీత్ హోమ్స్ లో కృష్ణారావు డైరెక్టర్ గా ఉన్నాడు. ప్రణీత్ హోమ్స్ కార్యాలయాలతోపాటు ఎండీ నరేందర్, మరో ఐదుగురు డైరెక్టర్ల ఇళ్లల్లో ఐటీ సోదాలు చేస్తున్నారు.
ఇవాళ తెల్లవారుజామున ప్రారంభమైన ఐటీ సోదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఐటీ రిటర్న్ చెల్లించడంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కృష్ణారావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల ఇళ్లల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఇప్పటివరకు 14 గంటలుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కొన్ని కీలక ఆధారాలు, డాక్యుమెంట్స్ సేకరించారు. సురేష్ ప్రొడక్షన్ తోపాటు రామానాయుడు స్టూడియోలో సోదాలు కొనసాగుతున్నాయి. హీరోలు నాని, వెంకటేష్ తోపాటు నిర్మాత రాధాకృష్ణతోపాటు మరికొందరి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.